Police Attacked Women: ఉత్తర ప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. మహిళలని చూడకుండా పోలీసులు వారిపై కర్రలు, లాఠీలతో దాడిచేశారు. ఇప్పుడు ఇదే విషయం విమర్శలకు దారితీస్తోంది. పోలీసుల తీరుపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే అంబేద్కర్‌నగర్ జిల్లా జలాల్‌పూర్‌లోని ఓ ప్రాంతంలో ఈ మధ్య బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆ ప్రాంతం తమదంటూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని కొందరు ధ్వంసం చేశారు. దీంతో ఆ ప్రాంతంపై అప్పటినుంచి వివాదం కొనసాగుతోంది.
Read Also: Kalyan Ram: ఆసక్తి రేపుతున్న కల్యాణ్ రామ్ కొత్త సినిమా టైటిల్
ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలు విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ.. ఆందోళణకు దిగారు. విషయం తెలియగానే పోలీసులు ఆందోళన చేస్తున్న ప్రాంతానికి చేరుకున్నారు. నిరసనకారులపై లాఠీలు, పైపులు, కట్టెలతో విచక్షణా రహితంగా దాడిచేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొందరు మహిళలు పోలీసుల వాహనాలపై రాళ్లు రువ్వడంతోనే వారిని చెదరగొట్టే ప్రయత్నంలో భాగంగా లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చిందని ఉన్నతాధికారులు తెలియజేశారు. మహిళల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
They say in Indian culture, women are seen as goddesses!
Male Police officers in UP, India barbarically beating up Dalit women. pic.twitter.com/8J6pFPfaho— Ashok Swain (@ashoswai) November 6, 2022