Pawan Kalyan: తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని చేబ్రోలులో వారాహి వాహనానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. పిఠాపురంలో పవన్ వారాహి సభకు పోలీసులు అనుమతి నిరాకరించగా.. పిఠాపురం పాదగయ క్షేత్రంలో శక్తి పీఠంలో వారాహికి పూజ వాయిదా పడింది. తాత్కాలికంగా చేబ్రోలులో మొదటి రోజు పవన్ సభ జరిపేందుకు డీసీఎంపై నుంచి మాట్లాడనున్నట్లు తెలిసింది. నిర్ణీత సమయంలో వారాహికి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోలేదని పోలీసులు చెప్తున్నారు. వారాహి వాహనంపై మాట్లాడొద్దని పోలీసులు సూచిస్తున్నారు. చిన్నపాటి వాహనానికి అనుమతిచ్చారు. కాగా పోలీసుల తీరుపై జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Pithani Balakrishna: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పితాని బాలకృష్ణ
జనసేనాని పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం పిఠాపురం నుంచి ప్రారంభించాలని తొలి విడత ప్రచార ప్రణాళికను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రచార కార్యక్రమానికి ‘వారాహి విజయభేరి’ అని నామకరణం చేశారు. తాను అసెంబ్లీకి పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే పవన్ తన వారాహి విజయభేరి ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టనున్నారు. తొలి సభ నేడు చేబ్రోలు రామాలయం సెంటర్‌లో జరగుతోంది. జనసేన ఈ ఎన్నికల్లో 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో, మూడు విడతల్లో పవన్ ఎన్నికల ప్రచారం కొనసాగనుంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, సీఎం జగన్ ఎన్నికల ప్రచార బరిలో దూసుకెళ్తున్నారు. చంద్రబాబు ప్రజాగళం యాత్ర పేరిట ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటుండగా, సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరిట సభలకు హాజరవుతున్నారు.