Vizag Crime: క్షణిక సుఖాల కోసం చాలా మంది పండంటి కాపురాలను నాశనం చేసుకుంటున్నారు.. సాఫీగా సాగుతోన్న సంసారంలో మరో వ్యక్తి ప్రవేశంతో గొడవలు చోటు చేసుకోవడం.. ఆ తర్వాత హత్యలకు దారి తీసిన ఘటనలు నిత్యం వెలుగు చూస్తూనే ఉన్నాయి.. తాజాగా, విశాఖపట్నం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ రమేష్ దారుణ హత్యకు గురయ్యాడు.. ప్రియుడు, అతని స్నేహితుడు సహాయంతో కానిస్టేబుల్ అయిన తన భర్తను భార్య హత్య చేసినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే భర్త కానిస్టేబుల్ రమేష్‌ణు పక్కా స్కెచ్ వేసి భార్య హతమార్చినట్టు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు..
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విశాఖ వన్‌టౌన్ పీఎస్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తోన్న రమేష్.. ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు.. నిద్రలోనే చనిపోయినట్టు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది భార్య.. అయితే, రమేష్ కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో.. పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగు చూసింది.. ఇంట్లో నే పథకం ప్రకారం తలగడా దిండుతో భార్య శివజ్యోతి అలియాస్ శివాని హత్య చేసినట్టు గుర్తించారు.. హత్య చేసి గుండెనొప్పిగా చిత్రీకరించారు.. గత కొంత కాలంగా ట్యాక్సీ డ్రైవర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్న శివాని.. ఆ హత్యకు పూనుకుందని తెలుస్తోంది.. భర్తను హత్య చేసేందుకు తన ప్రియుడైన ట్యాక్సీ డ్రైవర్‌తో పాటు, అతడి స్నేహితుడి సహాయం కూడా తీసుకుందట.. అంతేకాదు.. గుట్టుచప్పుడుగా అంతక్రియలు చేసేందుకు కూడా ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది.. ఎంవీపీ పోలీసుల విచారణలో శివాని అక్రమ సంబంధం బాగోతం వెలుగుచూడడంతో.. హత్య కేసు మిస్టరీ వీడినట్టు అయ్యింది. కాగా, 2009లో కానిస్టేబుల్ గా విధుల్లో చేరాడు బర్రి రమేష్.. ఇక, రమేష్-శివాని దంపతులకు ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు.