వన్ సైడ్ లవ్.. అది ఫలించకపోవడంతో తనకు దక్కనిది ఎవరికి దక్కకూడదని కక్ష పెంచుకున్నాడు ఆ ప్రేమోన్మాది. తన ప్రేమను నిరాకరించిందని మద్యం మత్తులో ఒంటరిగా ఉన్న యువతి ఇంటికి వెళ్లి విచక్షణ రహితంగా కత్తితో 13 సార్లు పొడిచాడు. గాయాలతో రక్తపు మడుగులో జీవచ్ఛవంలా ఆ యువతి పడిపోవడంతో ఆమె చనిపోయింది అనుకున్న ఆ యువకుడు అక్కడి నుండి పారిపోయాడు.