Call Money Case: నూటికి పది రూపాయల వడ్డీ.. కాల్ మనీ కేటుగాడు రాజా అరెస్ట్
- నూటికి పది రూపాయల వడ్డీ
- అది కూడా వారం వడ్డీ, రోజు వడ్డీ ప్రకారం వసూల్
- కాల్ మనీ కేటుగాడు రాజాను అరెస్ట్ చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం కాల్ మనీ కేసులో కీలక నిందితుడు రాజాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల ఓ చేనేత కుటుంబంపై రాజా అండ్ గ్యాంగ్ డాడికి పాల్పడింది. తాజాగా ప్రధాన నిందితుడు రాజాను అరెస్ట్ చేసి.. అతని వద్ద కోటి రూపాయల విలువైన ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే అధిక వడ్డీలకు ఇచ్చిన రెండు ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. గతంలోనే రౌడీ షీట్, మర్డర్, కాల్ మనీ కేసులు ఉన్నట్లు గుర్తించారు.
Also Read:Arya Marriage : 12 ఏళ్ల కూతురు ఉండగా రెండో పెళ్లి చేసుకున్న యాంకర్
Also Read
- Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
- Modi-Netanyahu: మోడీకి నెతన్యాహు ఫోన్.. ఉద్రిక్తతల వేళ కీలక సంభాషణ
- Botsa Satyanarayana: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి.. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి..
- West Bengal: మసీదు లౌడ్‌స్పీకర్లపై బెంగాల్లో రగడ.. అమిత్ షా ముందు పంచాయతీ..
నూటికి పది రూపాయల వడ్డీ వసూలు చేస్తారు. అది కూడా కొందరు వారం వడ్డీ, రోజు వడ్డీల ప్రకారం ఇస్తున్నారంటే ఆ దోపిడీ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అలా జనాల రక్తాన్ని జలగలా పీలుస్తున్న కాల్ మనీ కేటుగాడు రాజాను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీసత్యసాయి జిల్లాలో ధర్మవరంలో అక్రమ వడ్డీ వ్యాపారం, హింసాత్మక వసూళ్లకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్నాడు సాకే రాజశేఖర్ అలియాస్ ఎరికల రాజా అలియాస్ యర్రగుంట్ల రాజా. ఇతన్ని ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమ వడ్డీ వ్యాపారం చేస్తూ, వడ్డీ చెల్లించని వారిని తన గుంపుతో కలిసి బెదిరించడం. దాడులు చేయించడం, బలవంతంగా డబ్బులు వసూలు చేయడం వంటి హింసాత్మక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. ఇటీవల ఓ చేనేత కుటుంబంపై దాడి చేసిన కేసులో రాజాతో పాటు అతని గ్యాంగ్ మొత్తాన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Also Read:Venky Comedian Ramachandra : మంచాన పడ్డ ‘వెంకీ’ సినిమా కమెడియన్ రామచంద్ర
జులై 23న ఎర్రగుంటకు చెందిన రాజాతోపాటు అతని అనుచరులు మొత్తం ఏడుగురు.. బాధితుడు రమణ ఇంటికి వచ్చి వడ్డీ చెల్లించాలని బెదిరించారు. ప్రస్తుతానికి ఉపాధి లేదని, త్వరలోనే చెల్లిస్తామని కాళ్లావేళ్లా పడి ప్రాధేయపడినా వారు కనికరించలేదు. రమణ, భారతి దంపతులను చుట్టుముట్టి ఇష్టానుసారం దాడి చేశారు. ‘కొట్టొద్దండి… చచ్చిపోతాం’ అంటూ ఎంతబతిమిలాడినా దయచూపలేదు. అమానుషంగా దాడి చేశారు. దెబ్బలు భరించలేక వారు అరుస్తూ కేకలు వేసినా చుట్టుపక్కల వారు సైతం వడ్డీ వ్యాపారులకు భయపడి వారించే యత్నం చేయలేదు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చిన వెంటనే ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు అదే కేసులో రాజాను అరెస్ట్ చేశారు. అక్రమ వడ్డీ వ్యాపారం, దాడులు, బెదిరింపులు, హింసాత్మక ఘటనలకి పాల్పడే వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. అంతే కాదు రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు.
తాజావార్తలు
-
Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
-
Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
-
Modi-Netanyahu: మోడీకి నెతన్యాహు ఫోన్.. ఉద్రిక్తతల వేళ కీలక సంభాషణ
-
Botsa Satyanarayana: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి.. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి..
-
West Bengal: మసీదు లౌడ్‌స్పీకర్లపై బెంగాల్లో రగడ.. అమిత్ షా ముందు పంచాయతీ..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!