పోలవరం గ్రామానికి చెందిన యువతి అమెరికాలో తన ప్రతిభతో మన్ననలు అందుకుంటోంది. కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గం గూడూరు మండలం పోలవరం భామ "మిస్ తెలుగు యూఎస్‌ఏ" కిరీటం సొంతం చేసుకుంది. పోలవరానికి చెందిన జాగాబత్తుల దుర్గాప్రసాద్, శ్రీవల్లి దంపతుల ఏకైక కుమార్తె నాగ చంద్రికా రాణి అమెరికాలోని ఫ్లోరిడాలో ఎంఎస్ చదువుతోంది. ఈనెల 25వ తేదీన డల్లాస్‌లో తెలుగు సంఘాల ఆధ్వర్యంలో మిస్ తెలుగు యూఎస్‌ఏ పోటీలు నిర్వహించారు.