Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- పీఓకేలో దుర్మార్గాలకు పాల్పడుతున్న పాకిస్తాన్..
- గర్భిణీలు, పిల్లలని చూడకుండా హత్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(POK)లో పాకిస్తాన్ ప్రభుత్వం, ఆర్మీ అకృత్యాలకు పాల్పడుతోంది. హక్కుల కోసం పోరాడుతున్న అక్కడి ప్రజల్ని అణిచివేస్తోంది. నిరసనకారులపై జరిపిన కాల్పుల్లో 30 మంది మరణించినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం, వందలాది మందిని పాక్ భద్రతా బలగాలు కాల్చి చంపినట్లు తెలుస్తోంది. జూన్ 5 నుంచి జూన్ 9 మధ్య పాక్ ఆర్మీ చేపట్టిన భద్రతా ఆపరేషన్లలో భారీగా అకృత్యాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్‌లో ఏడుగురు గర్భిణీ స్త్రీలతో సహా 26 మంది మరణించారు. మృతుల్లో 19 మంది పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
పీఓకేలో నిరసనలకు నేతృత్వం వహిస్తున్న జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) ఉద్యమంతో సంబంధం ఉన్న నిరసనకారులను అణచివేసేందుకు హత్యలు చేసినట్లు తెలుస్తోంది. నిరసనలను అణచివేయడానికి సుమారు 14,000 మంది అదనపు పాకిస్తానీ భద్రతా సిబ్బందిని PoKలోకి పాక్ ప్రభుత్వ పంపినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ వార్తలు బయటి ప్రపంచానికి తెలియకుండా ఇంటర్నెట్పై నిషేధం విధించింది.
Also Read
- Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
- US-Iran Tensions: "ఆ ఒప్పందం కేవలం ఊహాగానమే".. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన ఇరాన్!
- Pentagon Lockdown: పెంటగాన్‌లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
- UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
ఈ నిరసనలు పీఓకేలోని మీర్పూర్, ముజఫరాబాద్, గిల్గిత్ బాల్టిస్తాన్, దాదియాల్, రావల్కోట్, సుధ్నోటీ, తట్టపాని వంటి ప్రాంతాలకు విస్తరించాయి. నిరసనకారులు పాక్ ఆర్మీ, ఐఎస్ఐ, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అసిమ్ మునీర్ ఒక ఉగ్రవాది అంటూ ప్రజలు నినాదాలు చేస్తున్నారు. పాక్ ప్రభుత్వ అణిచివేతపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ దేశం పాల్పడే అకృత్యాలకు జవాబుదారీగా చేయాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. పీఓకేలో మానవహక్కుల ఉల్లంఘనపై 30 మంది బ్రిటిష్ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రానికి అడ్డంకులు?
-
Meenakshi Natarajan: “మేము జోక్యం చేసుకోలేం”.. సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కి ఎదురుదెబ్బ
-
Tata Motors: షాకింగ్ న్యూస్.. భారీగా పెరగనున్న టాటా కార్ల ధరలు.. ఈ డేట్‌లోపు కొనేయండి..
-
Rohit Sharma: వయసు పెరిగినా జోరు తగ్గలేదు.. రికార్డుల పుస్తకాల్లోకి మరోసారి ‘హిట్ మ్యాన్’..
-
Explained: పార్టీ vs ప్రజాబలం.. సొంతవారే వెన్నుపోటు పొడిచిన వేళ.. ఇందిర గాంధీలా మమత హిస్టారికల్ కమ్‌బ్యాక్ ఇస్తారా?
ట్రెండింగ్
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్‌ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!