PoK: పీఓకేలో రక్తపాతం.. పాక్ బలగాల కాల్పుల్లో ఆరుగురు మృతి
- పీఓకేలో ఉద్రిక్త పరిస్థితులు..
- పాక్ భద్రతా బలగాల కాల్పుల్లో ఆరుగురు మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PoK: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(PoK)లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రావల్ కోట్ ప్రాంతంలో పాక్ భద్రతా బలగాల కాల్పుల్లో ఆరుగురు సాధారణ పౌరులు మరణించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన అక్కడి స్థానికుల్లో మరింత ఆగ్రహాన్ని పెంచింది. గత కొన్ని రోజులుగా హక్కుల కోసం పీఓకే ప్రజలు ఉద్యమిస్తున్నారు. దీనిని అణచివేయడానికి పాక్ ఆర్మీ, ప్రభుత్వం రక్తపాతానికి పాల్పడుతోంది.
రావల్కోట్ లోని న్యూ బస్ టెర్మినల్ సమీపంలో స్థానికులు, భద్రతా బలగాలకు మధ్య ఘర్షణ ఏర్పడింది. ఈ సమయంలో భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో పలువురు పౌరులు మరణించారు. మరణించిన వారిలో జాహిద్ ముఘల్, జఫర్ ముఘల్, అర్సలాన్ అక్బర్, వజీద్ హయత్ ఉన్నట్లు స్థానికులు పేర్కొన్నారు.
Also Read
- PM Modi: పుతిన్‌ను ఒప్పించి, అణు యుద్ధాన్ని అడ్డుకుంది మోడీనే: పోలాండ్ మంత్రి.
- Modi-Bear Grylls: మోడీ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నాయకుడు.. బేర్ గ్రిల్స్ ప్రశంసలు
- Free Afghan Women: ఒక బుర్ఖా.. 1000 ప్రశ్నలు.. ప్రపంచాన్ని కదిలిస్తున్న ట్రెండ్ వెనుక అసలు కథ ఇదే!
- Iran Missile Attack: ముదురుతున్న యుద్ధం.. హార్ముజ్‌లో యూఏఈ ట్యాంకర్లపై ఇరాన్ క్షిపణులు దాడులు
మరోవైపు, పీఓకే ప్రవాసులు అమెరికాలోని వాషింగ్టన్ వైట్‌హౌజ్ ముందు నిరసన చేపట్టారు. మహిళలు, చిన్నారులు సహా దాదాపు 100 మందికి పైగా ఆందోళనల్లో పాల్గొన్నారు. పీఓకే నుంచి పాక్ సైన్యం ఉపసంహరించుకోవాలని, నిరాయుధ ప్రజలపై బలప్రయోగాన్ని నిలిపేయాలని వారు డిమాండ్ చేశారు. పీఓకేలో పాకిస్తాన్ ఇంటర్నెట్ నిలిపేయడం వల్ల 40 లక్షల మంది ప్రజలకు ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయని ఆరోపించారు. అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని, మానవతా సాయం అందించేందుకు భారత్‌లోని పూంచ్, దోడా మార్గాలను తెరవాలని పీఓకే ప్రజలు విజ్ఞప్తి చేస్తు్న్నారు.
తాజావార్తలు
-
PM Modi: పుతిన్‌ను ఒప్పించి, అణు యుద్ధాన్ని అడ్డుకుంది మోడీనే: పోలాండ్ మంత్రి.
-
PoK: పీఓకేలో రక్తపాతం.. పాక్ బలగాల కాల్పుల్లో ఆరుగురు మృతి
-
Viral Video: అమ్మ పెళ్లి చేస్తోందని గుండు చేయించుకున్న అమ్మాయి? వైరల్ వీడియో వెనుక అసలు నిజం ఇదేనట!
-
Vitamin Guide for Every Organ: మెదడు నుంచి ఎముకల వరకు.. ఏ అవయవానికి ఏ విటమిన్ కీలకం..?
-
Gas Burner Cleaning: గ్యాస్ బర్నర్ మంట పసుపు రంగులో వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో క్లీన్..
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!