Free Afghan Women: ఒక బుర్ఖా.. 1000 ప్రశ్నలు.. ప్రపంచాన్ని కదిలిస్తున్న ట్రెండ్ వెనుక అసలు కథ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nobody is free until everybody is free..! ఎన్నో దశాబ్దాల క్రితం అమెరికా పౌరహక్కుల ఉద్యమ నాయకురాలు ఫ్యానీ లూ హేమర్ చెప్పిన ఈ ఒక్క మాటను ఇప్పుడు ప్రపంచమంతా మరోసారి గుర్తు చేసుకుంటోంది. కారణం ఒక సోషల్‌మీడియా ట్రెండ్..! అవునండి..! ఫ్రీ ఆఫ్ఘాన్ విమెన్ అనే పిలుపు ఇప్పుడు ఒక హ్యాష్ ట్యాగ్ పరిమితిని దాటి ప్రపంచ మనస్సాక్షిని కదిలిస్తున్న ఉద్యమంగా మారిపోయింది.
ఫ్రీ ఆఫ్ఘాన్ విమెన్ ట్రెండ్ ఎలా మొదలైంది?
కొన్ని సెకన్ల నిడివి ఉన్న కొన్ని వీడియోలు ఇప్పుడు ప్రపంచాన్ని ఆలోచనలోకి నెడుతున్నాయి. ఆ వీడియోలు మొదలైన వెంటనే ఓ ఆఫ్ఘాన్ జలేబీ పాట వినిపిస్తుంది. ఒక యువతి చిరునవ్వుతో కెమెరా ముందు నిలబడుతుంది. చూస్తున్న వాళ్లకు అది సాధారణ మేకప్ రీల్ లాగానే అనిపిస్తుంది.
కొన్ని క్షణాల తర్వాత మ్యూజిక్ ఒక్కసారిగా భారంగా మారుతుంది. అదే యువతి బుర్ఖాలో కనిపిస్తుంది. చివర్లో ఫ్రీ ఆఫ్ఘాన్ విమెన్ అనే సందేశం స్క్రీన్‌పై కనిపిస్తుంది. వీడియో అక్కడ ముగుస్తుంది కానీ ఆలోచన మాత్రం అక్కడి నుంచే మొదలవుతుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలు ఇదే వీడియోలను మళ్లీ మళ్లీ చేస్తున్నారు. అందాన్ని చూపించేందుకో, వినోదం కోసమో కాదండి.. కోట్లాది ఆఫ్ఘాన్ మహిళల మౌన వేదనను అర్థంచేసుకోవడానికి. అందుకే ఈ ట్రెండ్ కొన్ని గంటల్లోనే కోట్లాది వ్యూస్ సాధిస్తోంది. లక్షలాది కామెంట్లు వస్తున్నాయి. గుండెను తాకిందని, కళ్లలో నీళ్లు తెప్పించిందని, ప్రతి మహిళ ఈ వీడియోలు చూడాలని వేలాది మంది కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ కథను అర్థంచేసుకోవాలంటే ఓ సారి గతాన్ని గుర్తుచేసుకోవాలి.
Also Read
View this post on Instagram
ఆఫ్ఘాన్ మహిళలపై ఆంక్షలు ఎప్పుడు మొదలయ్యాయి?
1996లో తాలిబన్లు మొదటిసారి ఆఫ్ఘానిస్తాన్ అధికారాన్ని చేపట్టిన తర్వాత మహిళల జీవితాలపై వరుస ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. చదువు, ఉద్యోగంపై నియంత్రణ పెరిగింది. స్వేచ్ఛగా బయటకు వెళ్లడం, ప్రజా జీవితంలో భాగం కావడం లాంటివి మాయమయ్యాయి. 2001లో అమెరికా నేతృత్వంలోని దళాలు ఆఫ్ఘానిస్తాన్‌లోకి ప్రవేశించిన తర్వాత పరిస్థితులు మారడం ప్రారంభమైంది.
View this post on Instagram
దాదాపు 20సంవత్సరాల పాటు వేలాది బాలికలు మళ్లీ పాఠశాలల్లో అడుగుపెట్టారు. మహిళలు విశ్వవిద్యాలయాల్లో చేరారు. డాక్టర్లు, ఇంజినీర్లు,ఉపాధ్యాయులు, జర్నలిస్టులయ్యారు. వ్యాపారాలు ప్రారంభించారు. పార్లమెంట్ వరకు చేరుకున్నారు. ఆఫ్ఘానిస్తాన్ నెమ్మదిగా కొత్త ఆశలను నిర్మించుకోవడం ప్రారంభించింది. ఆ ఆశలన్నీ 2021 ఆగస్టు 15 తర్వాత ఒక్కసారిగా చీకటిలో కలిసిపోయాయి.
తాలిబన్లు మళ్లీ కాబూల్‌ను స్వాధీనం చేసుకుని అధికారంలోకి వచ్చారు. ప్రపంచం చూస్తుండగానే మహిళల హక్కులు ఒక్కొక్కటిగా అదృశ్యమవడం ప్రారంభమైంది. బాలికలకు సెకండరీ ఎడ్యూకేషన్ నిలిచిపోయింది. 2022లో మహిళల విశ్వవిద్యాలయ ప్రవేశంపై నిషేధం అమల్లోకి వచ్చింది. అనేక ఉద్యోగాల నుంచి మహిళలను తొలగించారు. పార్కులు, జిమ్‌లు, అనేక ప్రజా ప్రదేశాల్లో ప్రవేశాన్ని నిలిపివేశారు. దుస్తులపై కూడా కఠినమైన నిబంధనలు అమలయ్యాయి.
తమ హక్కుల కోసం గళం విప్పిన మహిళల్లో చాలామంది బెదిరింపులు, అరెస్టులు, నిర్బంధం, హింసను ఎదుర్కొన్నారని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. ఒక చట్టం మారినప్పుడల్లా ఒక అమ్మాయి కల ఆగిపోయింది. ఒక నిషేధం అమల్లోకి వచ్చినప్పుడల్లా ఒక కుటుంబం ఆశలు కూలిపోయాయి. పుస్తకాలు పట్టాల్సిన చేతులు ఇంటి గోడల మధ్య బంధీగా మారిపోయాయి. వేదికలపై మాట్లాడాల్సిన గొంతులు మౌనంలో కలిసిపోయాయి. ప్రపంచం వినాల్సిన కథలు గదుల తలుపుల వెనుక చిక్కుకుపోయాయి. అయినా ఆఫ్ఘాన్ మహిళలు తలవంచలేదు. రహస్య తరగతులు నిర్వహిస్తున్నారు. ఇళ్లలోనే కుమార్తెలకు విద్య నేర్పిస్తున్నారు. తమపై జరుగుతున్న అన్యాయాన్ని ఆధారాలతో ప్రపంచానికి చేరవేస్తున్నారు. ప్రతి నిషేధానికి ఎదురుగా మరో ధైర్యం నిలబడుతుందని తమ జీవితాలతో నిరూపిస్తున్నారు.
వారి పోరాటం చేతుల్లో ఆయుధాలతో సాగడం లేదు. జ్ఞానంతో సాగుతోంది. ఆశతో సాగుతోంది. భవిష్యత్తుపై నమ్మకంతో సాగుతోంది. అందుకే ఈ ట్రెండ్ ప్రపంచాన్ని కదిలిస్తోంది. వీడియోలో ఇష్టమైన డ్రెస్‌ను వదిలేసి బుర్ఖా ధరించడమనేది లక్షలాది మహిళలపై విధించిన నియంత్రణకు ప్రతీకగా మారింది.
ఇలా కొన్ని సెకన్ల వీడియో వెనుక దాగి ఉన్న కథ మాత్రం నాలుగేళ్ల ఆవేదనను మోస్తోంది. ఈ రోజు ఆఫ్ఘానిస్తాన్ తీవ్రమైన మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆర్థిక అస్థిరత, పెరుగుతున్న పేదరికం, ఆహార కొరత, వాతావరణ మార్పుల ప్రభావం, నిరాశ్రయ జీవితం లక్షలాది కుటుంబాలను వెంటాడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మహిళలపై ఉన్న ఆంక్షలు వారి జీవితాలను మరింత దారుణంగా ఐక్యరాజ్యసమితి సహా అనేక అంతర్జాతీయ సంస్థలు పలుమార్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. అయినా అక్కడి మహిళల పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది. నిజానికి ప్రతి విప్లవం ఒక చిన్న స్వరంతోనే మొదలవుతుంది. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న ఫ్రీ ఆఫ్ఘాన్ విమెన్ అనే పిలుపు కూడా అలాంటి గళమే. దీన్ని ఒక హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌గా మాత్రమే చూడొద్దు. చదువుకోవాలని ఎదురుచూస్తున్న ప్రతి అమ్మాయి గళంగా చూడాలి.
తన జీవితాన్ని తానే నిర్ణయించుకోవాలని కోరుకునే ప్రతి మహిళ ఆకాంక్ష ఇదే. ఎందుకంటే ఒక మహిళ స్వేచ్ఛను రాజ్యమే బంధించిన రోజు, మానవత్వం మొత్తం తన స్వేచ్ఛలో కొంత భాగాన్ని కోల్పోతుంది. అందుకే ఫ్యానీ లూ హేమర్ చెప్పిన ఆ ఒక్క మాట ఇప్పటికీ ప్రపంచాన్ని ప్రశ్నిస్తూనే ఉంది.
తాజావార్తలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
-
AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..