Sharwanand : యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. గతేడాది మనమే సినిమాతో అలరించారు. ప్రస్తుతం ఆయన రామ్ అబ్బరాజు డైరెక్షన్ లో నారి నారి నడుమ మురారి సినిమాలో నటిస్తున్నాడు. రామ్ అబ్బరాజు ఇంతకు ముందు సామజవరగమనకు పనిచేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ మూవీ రాబోతోంది. ఇప్పటికే మూవీ షూటింగ్ దాదాపు కంప్లీట్ అవడానికి వచ్చింది. అయితే తాజాగా మూవీ ఫస్ట్ సింగిల్ గురించి టీమ్ అప్డేట్ ఇచ్చింది.
Read Also : Meerut murder case: జైల్లో నిందితులకు రామాయణం అందజేసిన నటుడు
ఈ మూవీలో సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ ను ఏప్రిల్ 7వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. శర్వానంద్, సంయుక్త మీనన్ మధ్య దర్శనమే అనే పాటను రూపొందించారు. ఈ పాటనే రిలీజ్ చేయబోతున్నారు. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తున్నారు. శర్వానంద్ మంచి హిట్ కొట్టి చాలా కాలమే అవుతోంది. కాబట్టి ఈ సినిమాతో మరోసారి కామెడీ ట్రాక్ ఎక్కుతున్నాడు. శర్వానంద్ కు కామెడీ ట్రాక్ కలిసొస్తుంది. ఆయన కామెడీ ట్రాక్ లో చేసిన సినిమాలు దాదాపు హిట్ అయ్యాయి. మరి ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా లేదా అన్నది చూడాలి.