Site icon NTV Telugu

PM Modi: రాహుల్ గాంధీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ..

Pm Modi

Pm Modi

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నేడు తన 55వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్ నాయకుడికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి మోడీ తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ఎక్స్’లో “లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీకి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన దీర్ఘాయుష్షుతో, ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను” అని రాశారు.

READ MORE: Amit Shah: దేశంలో ఇంగ్లీష్ మాట్లాడే వారు త్వరలోనే సిగ్గుపడతారు..

రాహుల్ గాంధీ జూన్ 19, 1970న న్యూఢిల్లీలో జన్మించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ దంపతుల సంతానం. ప్రస్తుతం ఆయన ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు. అలాగే.. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు. ఆయన భారత్, విదేశాలలో విద్యను అభ్యసించారు. ఫ్లోరిడాలోని రోలిన్స్ కళాశాల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని ట్రినిటీ కళాశాల నుంచి ఎం.ఫిల్. డిగ్రీని పొందారు.

READ MORE: Nagarjuna : పాన్ ఇండియా సినిమాలు చేయడం చాలా కష్టమైన పని.. కుబేరలో యూనిక్ పాయింట్ ఉంది!

తన చదువు తర్వాత.. లండన్‌లోని మానిటర్ గ్రూప్ అనే కన్సల్టింగ్ సంస్థలో కొంతకాలం పనిచేశారు. తరువాత భారత్‌కు వచ్చి ముంబైలో టెక్నాలజీ అవుట్‌సోర్సింగ్ కంపెనీ అయిన బ్యాక్‌ఆప్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌ను స్థాపించడంలో సహాయపడ్డారు. రాహుల్ గాంధీ 2004లో తన తండ్రి సాంప్రదాయక సీటు అయిన ఉత్తరప్రదేశ్‌లోని అమేథి లోక్‌సభ స్థానానికి పోటీ చేసి గెలిచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.

Exit mobile version