కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ జూన్ 19న తన 55వ పుట్టినరోజును అత్యంత సరళంగా జరుపుకున్నారు. ఇటీవల పహల్గామ్ ఉగ్రవాద దాడి, అహ్మదాబాద్ విమాన ప్రమాదం, తన తల్లి సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరిన కారణంగా వేడుకలకు దూరంగా ఉన్నారు. రాహుల్ తన నివాసం 24 అక్బర్ రోడ్‌లో కార్యకర్తలు, నాయకులను కలిశారు. అక్కడ వాళ్లు ఏర్పాటు చేసిన కేక్ కట్ చేయడానికి నిరాకరించారు.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నేడు తన 55వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్ నాయకుడికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి మోడీ తన సోషల్ మీడియా హ్యాండిల్ 'ఎక్స్'లో "లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీకి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన దీర్ఘాయుష్షుతో, ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను" అని రాశారు.