Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Kubera Movie Release June 20 King Nagarjuna Press Conference Details

Nagarjuna : పాన్ ఇండియా సినిమాలు చేయడం చాలా కష్టమైన పని.. కుబేరలో యూనిక్ పాయింట్ ఉంది!

Published Date :June 19, 2025 , 2:52 pm
By Bhargav Chaganti
Nagarjuna : పాన్ ఇండియా సినిమాలు చేయడం చాలా కష్టమైన పని.. కుబేరలో యూనిక్ పాయింట్ ఉంది!
  • Follow Us :
  • google news
  • dailyhunt

సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న, హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా మూవీ శేఖర్ కమ్ముల ‘కుబేర’. అద్భుతమైన తారాగణంతో కుబేర ఇండియన్ సినిమాలో గేమ్-ఛేంజర్‌గా నిలవబోతోంది. ఇప్పటికే విడుదలైన కుబేర ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. పోయిరా మామ, ‘ట్రాన్స్ ఆఫ్ కుబేర’, పీపీ డమ్ డమ్ సాంగ్స్ చార్ట్ బస్టర్ రెస్పాన్స్ తో మ్యూజిక్ చార్ట్స్ లో టాప్ ట్రెండింగ్ లో వున్నాయి. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ హై ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు. కుబేర తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా కింగ్ నాగార్జున విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.

కుబేర లాంటి మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ చేయడానికి కారణం ?
-మంచి కథలు రావాలంటే స్టార్స్ కలిసి పనిచేయాలి. ఇంతకుముందు కూడా నేను చాలా సినిమాలు చేశాను. నాన్నగారు(ఏఎన్ఆర్) ఎన్టీఆర్ గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు.. ఇలా అంతమంది కలిసి ఎన్నో సినిమాలు చేశారు. శేఖర్ కమ్ముల గారితో వర్క్ చేయాలని ఎప్పటినుంచో ఉండేది. ఆనంద్ దగ్గర నుంచి ఆయన సినిమాలు గురించి మనందరికీ తెలుసు. ఆయన సినిమాలు నాకు బాగా ఇష్టం. ఆయన కథల్లో సోషల్ రెలివెంట్ పాయింట్ ఉంటుంది. మిగతావన్నీ కూడా కమర్షియల్ గానే ఉంటాయి. అద్భుతమైన పాటలు ఉంటాయి.

Also Read

  • Tollywood Pan World Movies: అందరికీ 'పాన్‌ వరల్డ్‌ మూవీ'నే కావాలా?
  • Vijay Varma Dating: జవాన్ నటితో మిల్కీ బ్యూటీ ఎక్స్ బాయ్‌ఫ్రెండ్! విజయ్ వర్మ ప్రేమలో ఉన్నాడా?
  • Puri Jagannadh: పూరీ 'స్లమ్ డాగ్' విడుదలకు అడ్డంకులు?
  • Bloody Romeo: నాని 'బ్లడీ రోమియో'కు బ్రేక్ ..కారణం ఏంటంటే?

కుబేరలో ఉన్న యూనిక్ పాయింట్ ఏమిటి ?
-కుబేరలో చాలా మంచి యూనిక్ పాయింట్ ఉంది. ఇప్పుడున్న సొసైటీకి ఆ పాయింట్ చాలా రిలెవెంట్. శేఖర్ గారికి ఈ పాయింట్ మైండ్ లో ఎప్పటినుంచో ఉంది. ఈ సినిమాల్లో మంచోళ్ళు ఉన్నారు. చెడ్డోళ్ళు ఉన్నారు. అల్ట్రారిచ్, మిడిల్ క్లాస్, బిలో పావర్టీ లైన్.. ఇలా మూడు సొసైటీల మధ్య క్లాష్ ఈ సినిమాలో ఉంటుంది.

ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?
-నాది మిడిల్ క్లాస్ క్యారెక్టర్. సిబిఐ ఆఫీసర్ క్యారెక్టర్ లో కనిపిస్తాను. మంచి చేయాలా? చెడు చేయాలా? అనే సంఘర్షణ మధ్య ఆ క్యారెక్టర్ ఉంటుంది. నా క్యారెక్టర్స్ లో చాలా షేడ్స్ వుంటాయి. శేఖర్ నా క్యారెక్టర్ ని చాలా అద్భుతంగా రాశారు. షటిల్ పెర్ఫార్మన్స్ కి మంచి స్కోప్ ఉండే క్యారెక్టర్. ఇందులో చాలా అద్భుతమైన ఇన్సిడెంట్స్ ఉంటాయి. అవన్నీ కూడా రియల్ లైఫ్ కి రిలేటెడ్ గా ఉంటాయి. ధనుష్ తన పాత్రలో ఒదిగిపోయాడు. అద్భుతంగా చేశాడు.

శేఖర్ గారు మీ ఇమేజ్ కి తగ్గట్టు స్క్రిప్ట్ లో ఏమైనా మార్పులు చేశారా ?
-లేదండి. ఆయన ఏమనుకున్నారో అదే చేశారు. నేను కూడా ఎలాంటి మార్పులు అడగలేదు. మారిస్తే చెడిపోతుంది.

మీ ఫ్యామిలీలో దాదాపుగా అందరూ శేఖర్ కమ్ముల గారితో చేశారు కదా.. ఆయన స్టైల్ గురించి ముందుగా ఎవరినైనా అడిగారా?
-చైతన్యని అడిగాను. ‘ఆయన వర్కింగ్ స్టైల్ చాలా బాగుంటుంది. మీరు సినిమా అంతా ఎంజాయ్ చేస్తారని’ చెప్పాడు

ఇప్పుడు వరకు మీరు చేసిన క్యారెక్టర్ అన్నిటిలో కుబేరలో క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉంటుందా ?
– ఈ సినిమా కథ డిఫరెంట్. నా బాడీ లాంగ్వేజ్, మాట తీరు, రియాక్షన్… అవన్నీ కూడా కొత్తగా ఉంటాయి. శేఖర్ కమ్ముల స్టైల్ లో ఉంటాయి.

– సినిమాని దాదాపుగా రియల్ లొకేషన్స్ లోనే షూట్ చేశాం. తిరుపతి, ముంబై, గోవా, బ్యాంకాక్ ఇలా అన్ని బిగ్ రియల్ లొకేషన్స్ లో వర్క్ చేసాం.

రష్మిక మందన క్యారెక్టర్ ఎలా ఉంటుంది?
-తన క్యారెక్టర్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. తను చాలా అద్భుతంగా చేసింది. సినిమా చూసి నువ్వే స్టార్ అని చెప్పాను. ఆ కథలో చాలా రిప్రెషన్ క్యారెక్టర్ అది.

కుబేర నిర్మాతల గురించి?
సునీల్ నారంగ్, పుష్కర రామ్మోహన్ గారు ఒక పెద్ద సినిమా చేయాలనుకున్నారు. తెలుగు, తమిళ్.. పాన్ ఇండియా స్థాయిలో ఈ ప్రాజెక్టుని చేయడం జరిగింది. చాలా పాషన్ తో సినిమా తీశారు. డైరెక్టర్ శేఖర్ కమ్ములకి కావాల్సినది ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఇచ్చారు. సినిమా చాలా అద్భుతమైన క్వాలిటీతో వచ్చింది.

దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ గురించి?
-ఈ సినిమాకి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. పాటలు చాలా సిచువేషనల్ గా వస్తాయి. దేవి వండర్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు.

-ఈ కథ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. రెగ్యులర్ స్క్రీన్ ప్లేకాదు. రొటీన్ క్యారెక్టర్స్ కావు. ప్రతీది డిఫరెంట్ గా ఉంటుంది. ఇందులో ఏ క్యారెక్టర్ కూడా హీరో హీరోయిన్ అనడానికి లేదు. అన్ని పాత్రలు గానే ఉంటాయి. ఇలాంటి సినిమాలు చేయడానికి గట్స్ కావాలి.

100 సినిమా ప్లానింగ్స్ జరుగుతున్నాయని విన్నాం?
అవునండి. ప్లానింగ్ చేస్తున్నాం. వర్కింగ్ టైటిల్ కింగ్ 100 అని పెట్టారు.

చాలా ఫిట్ గా కనిపిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆహార నియమాల్లో ఏమైనా మార్పులు చేశారా?
లేదండి. గత 15 ఏళ్లుగా ఏం చేస్తున్నానో అదే చేస్తున్నాను. కొత్తగా చేసింది ఏమీ లేదు.

పాన్ ఇండియా ట్రెండ్ మీద మీ ఒపీనియన్ ?
-పాన్ ఇండియా సినిమాలు చేయడం చాలా కష్టమైన పని. అన్ని సినిమాలు దానికి సరిపోవు. పాన్ ఇండియా సినిమా అని తీసినవన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలో కావడం లేదు కదా.

శివ 4k పనులు ఎంతవరకు వచ్చాయి ?
శివ 4కె ఫినిష్ అయింది. ఇంకా బెటర్ ఎఫెక్ట్స్ కోసం వర్క్ జరుగుతుంది. చాలా బాగా వస్తుంది. ఒక రీల్ చూసాను. చాలా అద్భుతంగా ఉంది.

సితార బ్యానర్ లో మీరు ఒక సినిమా చేస్తారాని విన్నాం?
సితార , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.. ఇలా అందరికీ చేయాలని ఉంది. అయితే ప్రాజెక్ట్ సెట్ కావాలి.

కూలీలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది ?
-కూలీలో డిఫరెంట్ కరెక్ట్ చేస్తున్నాను. లోకేష్ కనకరాజ్ కంప్లీట్ న్యూ ఏజ్ డైరెక్టర్. క్యారెక్టర్ చాలా కొత్తగా వుంటుంది. ఫస్ట్ టైం ఇలాంటి క్యారెక్టర్ ప్లే చేశాను.

ఆల్ ది బెస్ట్
-థాంక్యూ

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Dhanush
  • hindi movie
  • June 20 release
  • kannada movie
  • king nagarjuna

తాజావార్తలు

  • Magic Rava Bites Recipe: రవ్వతో కొత్త స్నాక్.. 15 నిమిషాల్లో ‘మ్యాజిక్ రవ్వ బైట్స్’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ..!

  • Royal Enfield Himalayan 440: రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త హిమాలయన్ 440 వచ్చేస్తోంది..

  • Mint Sharbat: కేవలం 2 నిమిషాల్లో తయారయ్యే సూపర్ హెల్తీ డ్రింక్.. సింపుల్‌గా మీ ఇంట్లో ఇలా చేసేయండి!

  • CM Revanth Reddy : పెద్ద‌ల చ‌దువుకు పెద్ద పీట‌.. వ‌యోజ‌నుల్లో అక్ష‌రాస్య‌త పెంపుపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌..

  • Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. ‘మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం’.. అంటూ ఆగ్రహం!

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions