BJP: రాజమండ్రిలో బీజేపీ నేతల వ్యాఖ్యలు.. మోదీ ప్రజాసేవ ఉత్సవాలకు సన్నాహాలు..

Bjp

Bjp

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్ 8న రాజమండ్రిలో 100 బీజేపీ జెండా స్థూపాల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు.

మీడియాతో మాట్లాడిన వారు, 25 సంవత్సరాల పాటు అంతరాయం లేకుండా ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ప్రజలకు సేవలందించడం నరేంద్ర మోదీకే సాధ్యమైందని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం అనంతరం 1947లో తొలి ఐదేళ్లు జవహర్‌లాల్ నెహ్రూ నామినేటెడ్ ప్రధానిగా కొనసాగారని, అనంతరం ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చిన ప్రధానులలో నెహ్రూ రికార్డును మోదీ అధిగమించారని అన్నారు.

సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా దీపోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు “మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ఉత్సవాలు” నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమాలు ఆర్భాటాలకు దూరంగా, సేవా కార్యక్రమాలకు అంకితభావంతో నిర్వహిస్తామని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. మోదీ ప్రజాసేవ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ ఉత్సవాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు.