Gujarat: నేడు గుజరాత్ లో యూఏఈ అధ్యక్షుడితో కలిసి ప్రధాని మోడీ రోడ్ షో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపు వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ ట్రేడ్ షో-2024ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన సన్నాహాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే, ఇవాళ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల ప్రధాన మంత్రితో పాటు యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సమావేశమవుతారని అధికారులు తెలిపారు.
Read Also: Astrology: జనవరి 09, మంగళవారం దినఫలాలు
Also Read
- Modi-Shinde: ప్రధాని మోడీతో ఏక్నాథ్ షిండే భేటీ.. సరికొత్త ఊహాగానాలు
- Minister Nimmala Ramanaidu: వెలిగొండ ప్రాజెక్టుపై కీలక ఆదేశాలు.. ఈ నెలలోనే నల్లమల సాగర్‌కు కృష్ణా జలాలు
- Kochi Flight: గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నం.. హడలెత్తిపోయిన ప్రయాణికులు
- AP DSC 2026: టీచర్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్.. త్వరలో కొత్త డీఎస్సీ..
కాగా, విమానాశ్రయంలో యూఏఈ అధ్యక్షుడికి స్వాగతం పలికిన తర్వాత సాయంత్రం మూడు కిలోమీటర్ల మేర రోడ్ షో కొనసాగుతుందని అహ్మదాబాద్ సిటీ పోలీస్ ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్ సఫిన్ హసన్ తెలిపారు. అహ్మదాబాద్‌ను గాంధీనగర్‌ను కలిపే ఇందిరా వంతెన దగ్గర రోడ్‌షో ముగుస్తుంది అని చెప్పారు. బ్రిడ్జి సర్కిల్ నుంచి గాంధీనగర్‌లోని వారి వారి గమ్యస్థానాలకు నేతలిద్దరూ బయలుదేరుతారన్నారు.
Read Also: Gastric Problem: చలికాలంలో గ్యాస్ ఎక్కువగా పడుతుందా? ఈ డ్రింక్ ను ఉదయాన్నే తాగారంటే..
అయితే, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. రేపు (బుధవారం) గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్ కన్వెన్షన్ సెంటర్లో వీజీజీఎస్ 10వ ఎడిషన్‌ను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ జనవరి 8 నుంచి 10 వరకు గుజరాత్లో తన మూడు రోజుల పర్యటన సందర్భంగా ప్రపంచ నాయకులతో పాటు అగ్రశ్రేణి సంస్థల సీఈఓలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు.
Read Also: Sankranti Holidays: ఏపీలో నేటి నుంచి సంక్రాంతి సెలవులు
ఇక, వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 10వ ఎడిషన్ గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్‌లో మూడు రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ కార్యక్రమం యొక్క థీమ్ ‘గేట్‌వే టు ది ఫ్యూచర్’గా తెలిపారు.. ఈ ఎడిషన్ ’20 సంవత్సరాల వైబ్రెంట్ గుజరాత్ విజయానికి పరాకాష్ట’గా జరుపుకుంటుంది. ఈ ఏడాది సమ్మిట్‌లో 34 భాగస్వామ్య దేశాలతో పాటు 16 భాగస్వామ్య సంస్థలు ఉన్నాయి. ఈ సారి, ఈశాన్య ప్రాంతాలలో పెట్టుబడి అవకాశాలను ప్రదర్శించడానికి ఈ ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ వైబ్రంట్ గుజరాత్ ప్లాట్‌ఫారమ్‌పై ప్రస్తావించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Vishwanath and Sons Trailer: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ టాక్.. సూర్య-మమితా కెమిస్ట్రీ అదుర్స్.!
-
Modi-Shinde: ప్రధాని మోడీతో ఏక్నాథ్ షిండే భేటీ.. సరికొత్త ఊహాగానాలు
-
Minister Nimmala Ramanaidu: వెలిగొండ ప్రాజెక్టుపై కీలక ఆదేశాలు.. ఈ నెలలోనే నల్లమల సాగర్‌కు కృష్ణా జలాలు
-
Ritika Nayak : ‘కొరియన్ కనకరాజు’తో జాక్‌పాట్.. టాలీవుడ్‌కు కొత్త గోల్డెన్ లెగ్గా రితికా నాయక్.!
-
Kochi Flight: గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నం.. హడలెత్తిపోయిన ప్రయాణికులు
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!