NTV Telugu Site icon

PM Modi: పోలాండ్ నుంచి ఇజ్రాయెల్, రష్యాకు ప్రధాని కీలక సలహా..

Pm Modi

Pm Modi

రెండు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ మొదటగా పోలాండ్ లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో.. ఉక్రెయిన్, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాంటి సమస్యనైనా యుద్ధభూమిలో కాకుండా సంభాషణలు, దౌత్యం ద్వారా పరిష్కరించుకోవచ్చని చెప్పారు. ఉక్రెయిన్ మరియు పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలు మనందరికీ తీవ్ర ఆందోళన కలిగించే విషయమని ప్రధాని మోడీ పేర్కొన్నారు. యుద్ధభూమిలో ఏ సమస్యకూ పరిష్కారం లభించదని భారత్ దృఢంగా విశ్వసిస్తోందని మోడీ చెప్పారు. మరోవైపు.. భారత్ తన స్నేహపూర్వక దేశాలతో చర్చలకు అన్ని విధాలా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందని ప్రధాని మోడీ తెలిపారు. తాము చర్చలు, దౌత్యానికి మద్దతు ఇస్తున్నామని ప్రధాని మోడీ అన్నారు. ఉగ్రవాదంపై పోరు కూడా అవసరమని భావిస్తున్నాం.. ఇది ప్రపంచ సవాలు, దీని కోసం అందరూ కలిసి రావాలని మోడీ సూచించారు.

Noida: అరె బాబు ఏంట్రా ఇది.. పోస్టుమార్టం గదిలో అదేం పనిరా..!

పోలాండ్ తర్వాత ప్రధాని మోడీ ఉక్రెయిన్‌లో కూడా పర్యటించడం గమనార్హం. ఉక్రెయిన్ పర్యటనకు ముందు ప్రధాని మోడీ బుధవారం మాట్లాడుతూ.. సమస్యాత్మక ప్రాంతంలో శాంతికి భారతదేశం మద్దతు ఇస్తుందని తెలిపారు. ఇది యుద్ధ యుగం కాదని.. ఏదైనా వివాదాన్ని దౌత్యం, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పునరుద్ఘాటించారు. పోలాండ్ రాజధానిలో భారతీయ కమ్యూనిటీ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడుతూ.. “దశాబ్దాలుగా భారతదేశం యొక్క విధానం అన్ని దేశాల నుండి దూరం పాటించడం. అయితే అన్ని దేశాలకు దగ్గరగా ఉండాలనేది నేటి భారత విధానం” అని పేర్కొన్నారు. నేటి భారతదేశం అందరితో కనెక్ట్ అవ్వాలని కోరుకుంటోందని మోడీ అన్నారు. నేటి భారతదేశం అందరి అభివృద్ధి గురించి మాట్లాడుతుంది.. నేటి భారతదేశం అందరితో ఉందని, ప్రతి ఒక్కరి ప్రయోజనాల గురించి ఆలోచిస్తుందని, ఏ దేశమైనా సంక్షోభాన్ని ఎదుర్కొంటే ముందుగా ఆదుకునేది భారత్‌ అని మోడీ చెప్పారు. “ప్రపంచంలో ఎక్కడైనా భూకంపం లేదా ఏదైనా విపత్తు సంభవించినట్లయితే, భారతదేశానికి ఒకే ఒక మంత్రం – ముందు మానవత్వం” అని ఆయన అన్నారు.

KTR : రుణమాఫీలో కటింగ్ పెడితే.. రైతుభరోసాలో కూడా కటింగ్‌లు పెడుతాడు

కాగా.. ప్రధాని మోడీ రేపు (ఆగస్ట్ 23న) ఉక్రెయిన్ వెళ్లనున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పడిన తర్వాత ఉక్రెయిన్‌లో పర్యటించనున్న తొలి భారత ప్రధాని మోడీనే. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ ఉక్రెయిన్‌లో పర్యటించనున్నారు. వివాదానికి శాంతియుత పరిష్కారంపై తన అభిప్రాయాలను ఉక్రెయిన్ అధినేతతో పంచుకుంటానని మోడీ చెప్పారు. మోడీ మాస్కో పర్యటనకు దాదాపు ఆరు వారాల తర్వాత కీవ్‌లో పర్యటించనున్నారు. అయితే.. మోడీ మాస్కో పర్యటనను అమెరికా, కొన్ని పాశ్చాత్య మిత్రదేశాలు విమర్శించాయి.