PM Modi: నేడు సూరత్‌లో ప్రధాని మోడీ పర్యటన.. 700 మెగావాట్ల అణు ప్లాంట్లు జాతికి అంకితం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
nuclear plants: నేడు గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ జిల్లాలోని తాపీ కక్రాపర్‌లో 22,500 కోట్ల రూపాయలతో నిర్మించిన రెండు 700 మెగావాట్ల అణు కేంద్రాలను ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేయనున్నారు. ఇది దేశంలోనే తొలి స్వదేశీ అణు విద్యుత్ కేంద్రంగా అవతరించనుంది. ఈ సందర్భంగా మెహసానా, నవ్సారిలో రూ.22,850 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
Read Also: Philippines : ఫిలిప్పీన్స్‌లో భారీ ప్రమాదం.. ట్రక్కు లోతైన గుంటలో పడి 15 మంది మృతి
Also Read
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
అలాగే, గుజరాత్ పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ రూ. 10,700 కోట్లతో నిర్మించనున్న వడోదర-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ క్రమంలో 50 ఏళ్ల శ్వేత విప్లవం, అమూల్ స్థాపన సందర్భంగా నేడు అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేసిన గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో 1.25 లక్షల మంది రైతులు, పశువుల కాపరులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం తర్వాత అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ లు కలిసి అమూల్ యొక్క 1200 కోట్ల రూపాయల విలువైన ఐదు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.
Read Also: Medaram Jatara: మేడారం జాతరకు సీఎం రేవంత్, గవర్నర్ తమిళసై.. ఏ రోజంటే..?
ఇక, ఈ క్రమంలో రేపు (శుక్రవారం) ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో పర్యటించనున్న ప్రధాని మోడీ 13 వేల కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు కూడా చేయనున్నారు. అలాగే, 40 వేల కోట్ల రూపాయలతో రూఫ్‌టాప్ ప్లాజాలు, సిటీ సెంటర్లను అభివృద్ధి చేయడం ద్వారా రైల్వే స్టేషన్లలో సౌకర్యాలను మెరుగుపరిచేందుకు 550 అమృత్ భారత్ స్టేషన్లకు ఫిబ్రవరి 26న ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారు. వివిధ రాష్ట్రాల్లో దాదాపు 1,500 రోడ్డు ఓవర్‌బ్రిడ్జిలు, అండర్‌బ్రిడ్జిలకు కూడా ప్రధాని శంకుస్థాపన చేస్తారని అధికారులు తెలిపారు. దాదాపు రెండు వేలకు పైగా రైల్వే స్టేషన్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు అని వెల్లడించారు.
తాజావార్తలు
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
-
Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి