Amrit Bharat Stations: ప్రధాని మోడీ చేతుల మీదుగా ‘అమృత్ భారత్ స్టేషన్ల’ ప్రారంభోత్సవం..!
- బేగంపేట రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి
- భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద లక్ష కోట్ల వ్యయంతో 1300కు పైగా రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధి
- రాబోయే 30-40 ఏళ్లపాటు ప్రయాణికుల అవసరాలను తీర్చేలా అభివృద్ధి
- ప్రయాణికులకు అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా సాగుతున్న అభివృద్ధి పనులు
- తెలంగాణ రాష్ట్రంలోని 40 రైల్వేస్టేషన్లలో దాదాపు రూ. 2,750 కోట్లతో సాగుతున్న పునరాభివృద్ధి పనులు
- తెలంగాణ రాష్ట్రంలోని బేగంపేట, కరీంనగర్, వరంగల్ రైల్వేస్టేషన్ల ప్రారంభం
- పూర్తిగా మహిళా ఉద్యోగులతో నడవనున్న బేగంపేట రైల్వేస్టేషన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amrit Bharat Stations: నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత దేశం అనేక రంగాలలో వేగవంతమైన అభివృద్ధితో ముందుకు సాగుతోంది. గతానికి భిన్నంగా అంతర్జాతీయ స్థాయిలో దేశాన్ని అగ్రభాగాన నిలబెట్టడమే లక్ష్యంగా ఆయా రంగాలలో ప్రపంచంతో పోటీ పడుతూ సాగుతున్న అభివృద్ధి, అందుకు జరుగుతున్న కృషి దేశాన్ని వికసిత భారత్ వైపు నడిపిస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన రైల్వే వ్యవస్థలో.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ దూరదృష్టి కారణంగా.. గత 11 ఏళ్లలో చోటు చేసుకున్న అభివృద్ధి, భవిష్యత్ అవసరాలు లక్ష్యంగా సాగుతున్న అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి.
Read Also: Bala Veeranjaneya Swamy: ఏ ఒక్క ఉద్యోగిని తొలగించం.. ఎలాంటి బదిలీలు ఉండవు!
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
తెలంగాణలో ప్రస్తుతం రూ.42,219 కోట్ల విలువైన రైల్వే అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది రైల్వే బడ్జెట్‌లోనూ రూ.5,337 కోట్లు తెలంగాణకు కేటాయించారు. ఇది 2014-15 నాటి తెలంగాణకు కేటాయించిన రైల్వే బడ్జెట్ తో పోలిస్తే 20 రెట్లు ఎక్కువ. రైల్వేలలో జరుగుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలలో ఒకటి రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధి. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ. 1 లక్ష కోట్ల అంచనా వ్యయంతో దేశవ్యాప్తంగా 1300కు పైగా రైల్వేస్టేషన్లలో పునరాభివృద్ధి కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు, 2023లో ప్రారంభించారు. రాబోయే 30 నుంచి 40 ఏళ్ల వరకు ప్రయాణికుల అవసరాలను తీర్చేలా ఆయా రైల్వేస్టేషన్లను సిద్ధం చేయనున్నారు. ఇందులో తెలంగాణలోనూ 40 రైల్వేస్టేషన్లలో దాదాపు రూ.2,750 కోట్లతో పునరాభివృద్ధి కార్యక్రమాలు చాలా వేగంగా సాగుతున్నాయి.
Read Also: MI vs DC: మ్యాచ్ గెలిచి ప్లేఆఫ్స్ లో నిలిచేదెవరో..? మొదట బ్యాటింగ్ చేయనున్న ముంబై ఇండియన్స్..!
అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా సాగుతున్న ఈ అభివృద్ధి పనులను పూర్తి చేసుకున్న 103 రైల్వేస్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం (22 మే, 2025) వర్చువల్ గా ప్రారంభించనున్నారు. ఇందులో తెలంగాణ రాష్ట్రంలోని బేగంపేట, కరీంనగర్, వరంగల్ రైల్వేస్టేషన్లు కూడా ఉన్నాయి. ఇందులో బేగంపేట రైల్వేస్టేషన్ పూర్తిగా మహిళా ఉద్యోగులతో నడవనుండటం విశేషం. బేగంపేట రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొననున్నారు.
పునరాభివృద్ధి పనులు జరుగుతున్న అన్ని రైల్వేస్టేషన్లలో ఆయా ప్రాంతాల్లోని సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ముఖద్వారం, స్టేషన్ ప్రధాన భవనాల నిర్మాణం సాగుతోంది. అంతేకాకుండా స్టేషన్ లోపల ప్రయాణికులకు అనువుగా ఫుట్‌పాత్‌లు, విశాలమైన ఓవర్ బ్రిడ్జిలు, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, వెయిటింగ్ హాల్స్, బుకింగ్ ఆఫీస్, టాయిలెట్ల నిర్మాణం, సైనేజ్ బోర్డుల ఏర్పాటు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి.
తెలంగాణలో అమృత్ భారత్ రైల్వేస్టేషన్లు – వాటి పునరాభివృద్ధికి కేటాయించిన బడ్జెట్ వివరాలు:
రైల్వేస్టేషన్ పేరు – బడ్జెట్
1. ఆదిలాబాద్ – రూ. 17.76 కోట్లు
2. బాసర – రూ. 11.33 కోట్లు
3. బేగంపేట – రూ. 22.57 కోట్లు
4. భద్రాచలం రోడ్డు – రూ. 25.41 కోట్లు
5. గద్వాల – రూ. 34.29 కోట్లు
6. హఫీజ్ పేట – రూ. 29.2 కోట్లు
7. హైటెక్ సిటీ – రూ. 25.93 కోట్లు
8. హుప్పుగూడ – రూ. 26.81 కోట్లు
9. హైదరాబాద్ – రూ. 327.27 కోట్లు
10. జనగామ – రూ. 24.45 కోట్లు
11. జడ్చర్ల – రూ. 35.54 కోట్లు
12. కాచీగూడ – రూ. 424.29 కోట్లు
13. కామారెడ్డి – రూ. 39.84 కోట్లు
14. కరీంనగర్ – రూ. 25.89 కోట్లు
15. కాజీపేట్ – రూ. 24.45 కోట్లు
16. ఖమ్మం – రూ. 25.41 కోట్లు
17. లింగంపల్లి – రూ. 310.38 కోట్లు
18. మధిర – రూ. 25.41 కోట్లు
19. మహబూబాబాద్ – రూ. 26.49 కోట్లు
20. మహబూబ్ నగర్ – రూ. 39.82 కోట్లు
21. మలక్ పేట – రూ. 36.44 కోట్లు
22. మల్కాజ్ గిరి – రూ. 27.61 కోట్లు
23. మంచిర్యాల – రూ. 26.49 కోట్లు
24. మెదక్ – రూ. 15.32 కోట్లు
25. మేడ్చల్ – రూ. 32.11 కోట్లు
26. మిర్యాలగూడ – రూ. 9.50 కోట్లు
27. నల్గొండ – రూ. 9.50 కోట్లు
28. నిజామాబాద్ – రూ. 53.03 కోట్లు
29. పెద్దపల్లి – రూ. 26.49 కోట్లు
30. రామగుండం – రూ. 26.49 కోట్లు
31. సికింద్రాబాద్ – రూ. 699.77 కోట్లు
32. షాద్ నగర్ – రూ. 32.99 కోట్లు
33. శ్రీ బాలబ్రహ్మేశ్వర జోగులాంబ – రూ. 6.07 కోట్లు
34. తాండూరు – రూ. 24.35 కోట్లు
35. ఉందానగర్ – రూ. 12.37 కోట్లు
36. వికారాబాద్ – రూ. 24.25 కోట్లు
37. వరంగల్ – రూ. 25.41 కోట్లు
38. యాదాద్రి – రూ. 24.45 కోట్లు
39. యాకుత్ పుర – రూ. 8.53 కోట్లు
40. జహీరాబాద్ – రూ. 24.35 కోట్లు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!