వారణాసిలో గంగా నదీ పుష్కరాల నేపధ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తుల సమ్మేళనం' కాశీ తెలుగు సంగమం' కార్యక్రమం నేడు జరగనుంది. "కాశీ తెలుగు సంగమం" పేరుతో ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి పలు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగనున్నాయి.
పవిత్ర గంగానది పుష్కరాలకు సర్వం సిద్ధమైంది. రేపటి(ఏప్రిల్ 22) నుంచి మే 3వ తేదీ వరకు 12 రోజుల పాటు పుష్కరాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఏప్రిల్ 22 నుండి మే 3 వరకు జరిగే గంగా పుష్కరాలు జాతరను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తారు.