International Yoga Day: అంతర్జాతీయ యోగా దినోత్సవం.. మైసూరులో ప్రధాని ఆసనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంతర్జాతీయ యోగా దినోత్సవం భారత్ సహా ప్రపంచ దేశాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కర్ణాటకలోని మైసూర్ నుంచి యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. పలు ప్రాంతాల్లో వేకువజామునుంచే ప్రముఖులు సహా సామాన్య ప్రజలు యోగాసనాలు వేస్తున్నారు. మానవత్వం కోసం యోగా(Yoga for humanity) అనే ఇతివృత్తంతో ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. కర్ణాటకలో ప్రధాని మోదీ ఈవెంట్‌లో సుమారు 15 వేల మంది పాల్గొన్నట్లు తెలుస్తోంది. ప్రధానితో పాటు కేంద్ర మంత్రి సర్భానంద సోనోవాల్, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై యోగాసనాలు వేశారు.
మైసూర్ భారత్‌కు ఆధ్యాత్మిక కేంద్రమని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచానికి భారత్ అందించిన అద్భుత కానుక యోగా అని ఆయన అభివర్ణించారు. ఒకప్పుడు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో యోగాసనాలు వేసేవారని.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యోగా చేస్తున్నారన్నారు. వేదాలు, ఉపనిషత్తుల్లో యోగా ప్రస్తావన ఉందన్నారు. విశ్వ మానవాళి ఆరోగ్యమే లక్ష్యమన్నారు. సూర్యుని కదలికలను అనుసరిస్తూ యోగాసనాలు వేయాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల మంది యోగా దినోత్సవంలో పాల్గొనే అవకాశం ఉందన్నారు.
Also Read
- TRAI New Recharge Rules: TRAI కొత్త నిబంధనలు.. Jio, Airtel, Vi రీఛార్జ్ ప్లాన్లలో కీలక మార్పులు..
- మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
- Telangana High Court: "ఆ పోలీసులను గుర్తించండి".. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
- Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
ఆరోగ్యం.. శ్రేయస్సు కోసం ప్రజలు యోగాను తప్పకుండా ఆచరించాలని ప్రధాని మోదీ పిలుపు ఇచ్చారు. గుండెపోటు, స్ట్రోక్, థైరాయిడ్, మధుమేహం తదితర జీవన శైలి వ్యాధులు నేటి తరంలో పెరిగిపోతున్నందున యోగాకు ప్రాధాన్యత పెరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొని, తమ నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని కోరారు. యోగా అంటే కేవలం ఆసనాలే కాదని, శ్వాస వ్యవస్థకు సంబంధించి వ్యాయామం కూడా అని ప్రధాని వివరించారు. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నారు. యోగాని సులభంగా చేసుకోవచ్చని తెలిపారు. దీన్ని చేయడానికి ఒక చాప, కొంచెం స్థలం ఉంటే చాలు. యోగాను ఇంట్లోనే చేసుకోవచ్చు. పనిలో.. విరామం సమయంలోనూ చేసుకోవచ్చని చెప్పారు ప్రధాని మోదీ. ఈ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేసి, యోగాను మరింత ప్రాచుర్యంలోకి తీసుకువద్దామని పిలుపు నిచ్చారు.
Karnataka | Prime Minister Narendra Modi arrives at Mysuru Palace Ground where he will perform Yoga, along with others, on #InternationalDayOfYoga
Union Minister Sarbananda Sonowal, CM Basavaraj Bommai and others are also present here. pic.twitter.com/cfj84smyB6
— ANI (@ANI) June 21, 2022
తాజావార్తలు
-
TRAI New Recharge Rules: TRAI కొత్త నిబంధనలు.. Jio, Airtel, Vi రీఛార్జ్ ప్లాన్లలో కీలక మార్పులు..
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Telangana High Court: “ఆ పోలీసులను గుర్తించండి”.. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
-
Praveen Kumar: ఏదైనా చేయాలనుంది.. కీలక పదవికి దరఖాస్తు చేసిన టీమిండియా మాజీ పేసర్!
-
Ramayana : రామాయణ ప్రీ పోన్.. మూడు రోజులు ముందుగా థియేటర్స్‌లోకి
ట్రెండింగ్
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!