PM Modi Kurnool Tour: ప్రధాని నరేంద్ర మోడీ కర్నూలు పర్యటనలో భద్రత లోపం వెలుగు చూసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుండిపెంట హెలిపాడ్‌లో ప్రధానికి వీడ్కోలు సమయంలో పాస్‌ల జాబితాలో లేని వ్యక్తుల ప్రవేశం కలకలం సృష్టించింది. ఇతరుల పేరుతో ఉన్న పాసులతో ప్రధాని వలయంలోకి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించారు. బీజేపీ నేతలు విశ్వరూపాచారి, తూముకుంట శివారెడ్డి పేర్లతో పాసులతో ఇద్దరు వ్యక్తులు ప్రవేశించారు. పాసులు ఉన్నవారు కాకుండ వెంకటేశ్వర్లు, బాలముని అనే వ్యక్తులు వెళ్లారని గుర్తించారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అసలు ఉన్న వారికి తెలియకుండా పాసులు దక్కించుకొని ట్యాంపరింగ్ చేశారనే అనుమానాలు ఉన్నాయి. వీఐపీల కోటాలో పాసులు లేని వారు కాకుండా వేరే వాళ్ళు వెళ్లడం కలకలం సృష్టిస్తోంది. ప్రమాదకర వ్యక్తులు ఇలాగే వెళ్లి ఉంటే పరిస్థితి ఏంటి..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత భద్రత చర్యలు తీసుకునే ప్రధాని పర్యటనలో భద్రత లోపాలపై ఇప్పటికే బీజేపీ పెద్దలు, పోలీస్ అధికారులకు ఫిర్యాదులు చేసినట్టు సమాచారం..
READ MORE: Danger: ఫోన్ 100% చార్జింగ్ పెడుతున్నారా.. అయితే బీకేర్ ఫుల్…