బీహార్ పర్యటన ముగించుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒడిశా చేరుకున్నారు. భువనేశ్వర్‌లో చేపట్టిన రోడ్ షోలో ప్రధాని పాల్గొన్నారు. మోడీని దగ్గర నుంచి చూసిన ప్రజలు ఉత్సాహంతో ఉప్పొంగి పోయారు. మోడీ కాన్వాయ్‌పై పూల వర్షం కురిపించారు. అనంతరం భువనేశ్వర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఒడిశా బీజేపీ ప్రభుత్వం విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుందన్నారు. ఈ వార్షికోత్సవం కేవలం ప్రభుత్వ వార్షికోత్సవం కాదని.. ఇది సుపరిపాలన స్థాపన వార్షికోత్సవం.. దీన్ని ప్రజాసేవ, ప్రజా విశ్వాసానికి అంకితం చేస్తున్నామని తెలిపారు.
READ MORE: iPhone 16: ఇది కలనా.. నిజమా..? ఐఫోన్ 16 ఫోన్లపై ఇంత భారీ డిస్కౌంట్స్ ఏంటి భయ్యా..!
ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఆసక్తికర అంశాన్ని పంచుకున్నారు. “రెండు రోజుల క్రితం నేను G7 శిఖరాగ్ర సమావేశానికి కెనడా వెళ్ళాను. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నాకు ఫోన్ చేశారు. ఎలాగో మీరు కెనడాకు వచ్చారు. వాషింగ్టన్ మార్గంలో భారత్‌కు వెళ్లండి. మనం వాషింగ్టన్‌లో కలిసి భోజనం చేసి మాట్లాడుకుందాం. అని ట్రంప్ నన్ను భోజనానికి ఆహ్వానించారు. కానీ నేను ఆయన ఆహ్వానాన్ని తిరస్కరించాను. మీ ఆహ్వానానికి ధన్యవాదాలు.. జగన్నాథుడి పుణ్యభూమికి వెళ్లడం నాకు చాలా ముఖ్యం.. అని నేను ట్రంప్‌తో చెప్పాను. మహాప్రభువు పట్ల నాకున్న ప్రేమ, భక్తి నన్ను ఈ భూమికి తీసుకువచ్చాయి.” అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
READ MORE: iPhone 16: ఇది కలనా.. నిజమా..? ఐఫోన్ 16 ఫోన్లపై ఇంత భారీ డిస్కౌంట్స్ ఏంటి భయ్యా..!
ఒడిశా దశాబ్దాలుగా అనేక సమస్యలను ఎదుర్కొంటోందని ప్రధాని మోడీ అన్నారు. పేదలు, రైతులు తమ పూర్తి హక్కులను పొందలేకపోయారని.. అవినీతి పాతుకు పోయిందన్నారు. ఒడిశాలో మౌలిక సదుపాయాలు దారుణమైన స్థితిలో ఉన్నాయని చెప్పారు. గత ఏడాది కాలంలో ఈ సవాళ్లను పరిష్కరించడానికి బీజేపీ ప్రభుత్వం పూర్తి శక్తితో పనిచేసిందని వెల్లడించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా ఒడిశాకు ప్రయోజనాలు చేకూరుతున్నాయని తెలిపారు. ఇప్పటికే ఇక్కడ వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు జరిగాయని గుర్తు చేశారు.
READ MORE:Dhanush : థియేటర్ లో ఏడ్చేసిన ధనుష్..
తాను గుజరాత్‌లో పుట్టానని ప్రధాని మోడీ అన్నారు. “మీరు సూరత్‌లో రెండు అడుగులకు ఒక ఒడియా వ్యక్తి కనిపిస్తాడు. ఒడిశా నుంచి చాలా మంది అక్కడికి వచ్చి స్థిరపడ్డారు. వారికి అక్కడ ఉచిత చికిత్స కూడా లభిస్తుంది. గతంలో ఒడిశా రైతులు కిసాన్ సమ్మాన్ నిధి పూర్తి ప్రయోజనాన్ని పొందలేకపోయారు. నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల ప్రయోజనాలను పొందుతున్నారు. ఎన్నికల సమయంలో తల్లులు, సోదరీమణులు, రైతులు, యువతకు మేము ఇచ్చిన హామీలు వేగంగా అమలు చేస్తున్నాం.” అని ప్రధాని వెల్లడించారు.
READ MORE:India- Iran: ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. భారత పౌరుల కోసం ఇరాన్ కీలక నిర్ణయం..
నక్సలైట్లను తుదముట్టించేందుకు తీసుకుంటున్న చర్యలను మోడీ మరోసారి గుర్తు చేశారు.గిరిజన సమాజం త్వరలోనే వారి హింస నుంచి విముక్తి పొందుతుందని ప్రధాని అన్నారు. దేశంలో నక్సలిజం అంతమవుతుందని హామీ ఇచ్చారు. గిరిజనుల అభివృద్ధి కోసం దేశంలో మొదటిసారిగా రెండు పెద్ద జాతీయ పథకాలు రూపొందించినట్లు వెల్లడించారు. ఈ రెండు పథకాలకు లక్ష కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. దేశంలో తొలి గిరిజన మహిళా రాష్ట్రపతి, ఒడిశా కుమార్తె రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ పథకానికి మార్గనిర్దేశం చేశారని తెలిపారు.
