బీహార్ పర్యటన ముగించుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒడిశా చేరుకున్నారు. భువనేశ్వర్‌లో చేపట్టిన రోడ్ షోలో ప్రధాని పాల్గొన్నారు. మోడీని దగ్గర నుంచి చూసిన ప్రజలు ఉత్సాహంతో ఉప్పొంగి పోయారు. మోడీ కాన్వాయ్‌పై పూల వర్షం కురిపించారు. అనంతరం భువనేశ్వర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఒడిశా బీజేపీ ప్రభుత్వం విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుందన్నారు. ఈ వార్షికోత్సవం కేవలం ప్రభుత్వ వార్షికోత్సవం కాదని.. ఇది సుపరిపాలన స్థాపన వార్షికోత్సవం.. దీన్ని ప్రజాసేవ,…