PM Modi: మోడీకి అరుదైన గౌరవం.. నార్వే అత్యున్నత పురస్కారం అందజేత
- ప్రధాని మోడీకి అరుదైన గౌరవం
- నార్వే అత్యున్నత పురస్కారం అందజేత
- 140 కోట్ల మంది భారతీయులకు గర్వకారణమని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీకి అరుదైన గౌరవం దక్కింది. నార్వేకు చెందిన అత్యున్నత పురస్కారం లభించింది. గ్రాండ్ క్రాస్ ఆఫ్ రాయల్ నార్వేజియన్ ఆర్డర్ పురస్కారం అందుకున్నారు. ఓస్లోలో నార్వే రాజు నుంచి ప్రధాని మోడీ పురస్కారం అందుకున్నారు. ప్రపంచం నుంచి మోడీ 32వ ప్రధాన పురస్కారాన్ని అందుకున్నారు. ఇది 140 కోట్ల మంది భారతీయులకు గర్వకారణమని మోడీ పేర్కొన్నారు.
ప్రధాని మోడీ ఐదు దేశాల పర్యటనల భాగంగా సోమవారం మోడీ నార్వేకు చేరుకున్నారు. ఓస్లోలో ఘనస్వాగతం లభించింది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ జరిగింది. అనంతరం నార్వేకు చెందిన అత్యున్నత పురస్కారమైన ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్’’ను ప్రదానం చేశారు. విదేశాల నుండి ప్రధాని మోడీ అందుకున్న 32వ ప్రధాన అంతర్జాతీయ పురస్కారం ఇది.
Also Read
‘‘గ్రాండ్ క్రాస్’’ అనేది రాయల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్లో అత్యున్నత శ్రేణి పురస్కారమని, అసాధారణమైన సేవలు అందించిన వ్యక్తులకు మాత్రమే దీనిని ప్రదానం చేస్తారని నార్వే ప్రభుత్వం పేర్కొంది. గౌరవాన్ని అందుకున్న అనంతరం మోడీ సోషల్ మీడియాలో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘‘రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ గ్రాండ్ క్రాస్‌ను అందుకోవడం నాకు గౌరవంగా ఉంది. ఈ గౌరవాన్ని భారతదేశ ప్రజలకు, బలమైన భారత్-నార్వే స్నేహానికి అంకితం చేస్తున్నాను. ఇది ప్రపంచ పురోగతికి మన ఉమ్మడి నిబద్ధతను ప్రదర్శిస్తుంది.’’ అని పేర్కొన్నారు.
Honoured to receive the Grand Cross of the Royal Norwegian Order of Merit. This honour is dedicated to the people of India and is a tribute to the enduring friendship between India and Norway. It reflects our shared commitment to global progress. pic.twitter.com/bh7ucPamK4
— Narendra Modi (@narendramodi) May 18, 2026
తాజావార్తలు
-
PM Modi: మోడీకి అరుదైన గౌరవం.. నార్వే అత్యున్నత పురస్కారం అందజేత
-
Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
-
IPL: ‘నన్ను అస్సలు పట్టించుకోలేదు’.. కేకేఆర్‌పై బంగ్లాదేశ్ స్టార్ లిటన్ దాస్ సంచలన వ్యాఖ్యలు..
-
Peddi: పెద్ది సినిమాకి కూడా పర్సంటేజ్ కావాల్సిందే.. పట్టు పడుతున్న ఎగ్జిబిటర్లు!
-
Pakistan-Saudi Arabia: సౌదీ అరేబియా రక్షణకు పాకిస్తాన్ కిరాయి సైన్యం..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!