Covishield: ఆ సర్టిఫికేట్లో నుంచి మోడీ ఫోటో తొలగింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొవిషీల్డ్ టీకా వేసుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నట్లు ఇటీవల ఆ టీకా తయారు చేసిన ఆస్ట్రాజెనికా కంపెనీ చెప్పడంతో.. భారత్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కోవిడ్- 19 టీకా తీసుకున్న వారికి ఇచ్చే కోవిన్ సర్టిఫికేట్‌లో ఉండే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫోటోను కేంద్ర ఆరోగ్య మంత్విత్వ శాఖ ఆ సర్టిఫికేట్ నుంచి తొలగించింది. చాలా అరుదైన కేసుల్లో కొవిషీల్డ్ వల్ల .. రక్తం గడ్డకట్టే ఛాన్స్ ఉందని ఆస్ట్రాజెనికా కంపెనీ ఇటీవల కోర్టులో అంగీకరించింది. కానీ, భారత్‌లో ఎన్నికల నియమావళిని దృష్టిలో పెట్టుకుని కోవిన్ సర్టిఫికేట్‌లో మోడీ ఫోటోను తొలగించినట్లు అధికార వర్గాలు చెప్పుకొచ్చాయి.
Read Also: Chennai Super Kings: చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐదుగురు స్టార్ బౌలర్లు దూరం!
Also Read
కాగా, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆప్ ఇండియా (ఈసీఐ) ఇచ్చిన ఆదేశాల మేరకు కోవిన్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోను తొలగించినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. అయితే, బ్రిటన్‌కు చెందిన ఆస్ట్రాజెనికా కంపెనీ యూరోప్ దేశాల్లో వాక్స్‌జెవేరియా పేరుతో టీకాను పంపిణీ చేస్తుంది. ఆ టీకానే కొవిషీల్డ్ పేరుతో భారత్ లో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనే సంస్థ తయారు చేసింది. కొవిషీల్డ్ వల్ల కొన్ని అరుదైన కేసుల్లో రక్తం గడ్డ కట్టే అవకాశాలు ఉన్నట్లు ఓ నివేదిక ద్వారా వెల్లడైంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!