PM Modi Mann Ki Baat: ఈ వర్షాకాలంలో ప్రకృతి వైపరీత్యాలు దేశాన్ని పరీక్షిస్తున్నాయని ‘మన్ కీ బాత్’ 125వ ఎపిసోడ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. “గత కొన్ని వారాలలో వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల భారీ విధ్వంసం సంభవించింది. ఇళ్లు ధ్వంసమయ్యాయి, పొలాలు మునిగిపోయాయి. నిరంతరం పెరుగుతున్న వరద నీటితో వంతెనలు, రోడ్లు కొట్టుకుపోయి ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. ఈ సంఘటనలు ప్రతి భారతీయుడిని బాధించాయి. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాల బాధ మనందరి బాధ” అని అన్నారు. విపత్తు సమయంలో సహాయక చర్యలలో పాల్గొన్న సైన్యం, SDRF, NDRF సహా అన్ని రెస్క్యూ బృందాలను ప్రధానమంత్రి ప్రశంసించారు. ఎక్కడ సంక్షోభం ఉన్నా, అక్కడి ప్రజలను రక్షించడానికి NDRF, SDRF సిబ్బంది, ఇతర భద్రతా దళాలు పగలు, రాత్రి అనే తేడా లేకుండా పనిచేశాయని అన్నారు.
READ ALSO: Tadipatri: జేసీ vs కాకర్ల.. గణేశ్ శోభాయాత్రలో రెండు వర్గాల మధ్య ఘర్షణ!
ప్రతిభా సేతు పోర్టల్..
యూపీఎస్సీ అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ‘ప్రతిభా సేతు’ పోర్టల్ ఏర్పాటు చేసినట్లు ప్రధాని మోడీ తెలిపారు. దీని ద్వారా యూపీఎస్సీ అభ్యర్థులకు అనేక ప్రయోజనాలు ఉన్నట్లు పేర్కొన్నారు. దేశంలోని కఠినమైన పరీక్షల్లో సివిల్ సర్వీసెస్ ఒకటని.. ప్రతి ఏడాది ఎంతో మంది అభ్యర్థులు రాస్తుంటారన్నారు. ఎంతో సమయం, డబ్బును ఖర్చు చేసి నిజాయతీగా కష్టపడుతున్న అభ్యర్థులు ఒక్కోసారి స్వల్ప తేడాతో సివిల్స్ తుది జాబితాలో చోటు దక్కించుకోలేకపోతున్నారని.. ఇలాంటి వారి కోసం ‘ప్రతిభా సేతు’ పోర్టలు ప్రవేశపెట్టినట్లు చెప్పారు. సివిల్స్ పరీక్షల అన్ని దశలలో ఉత్తీర్ణత సాధించి.. మెరిట్ లిస్టులో పేరు లేని అభ్యర్థుల వివరాలను ఇకపై ఈ పోర్టల్ లో ఉంచనున్నట్లు ప్రధాని వెల్లడించారు. ఈ వివరాలను ప్రైవేట్ కంపెనీలు తీసుకొని.. వారికి తమ సంస్థలలో వారికి ఉపాధి కల్పించవచ్చని చెప్పారు. యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
సహాయానికి సైన్యం ముందుకు వచ్చింది..
ప్రధాని మాట్లాడుతూ.. విపత్తు సమయంలో సహాయం చేయడానికి సైన్యం ముందుకు వచ్చింది. స్థానిక ప్రజలు, సామాజిక కార్యకర్తలు, వైద్యులు, ప్రతి ఒక్కరూ ఈ సంక్షోభ సమయంలో సాధ్యమైనంత వరకు ప్రమాదంలో ఉన్న వారిని రక్షించడానికి ప్రయత్నించారు. విపత్తు సమయంలో మానవత్వాన్ని చూపిన ప్రతి పౌరుడికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. వరదలు, వర్షాల వల్ల సంభవించిన ఈ విధ్వంసం మధ్య జమ్మూకాశ్మీర్ రెండు ప్రత్యేక విజయాలను సాధించిందన్నారు. ప్రమాద సమయంలో వీటిని చాలా మంది గమనించలేదని, కానీ మీరు ఈ విజయాల గురించి తెలుసుకోవాలన్నారు. పుల్వామా తొలి డే-నైట్ క్రికెట్ మ్యాచ్ జరిగింది. స్టేడియానికి రికార్డు స్థాయిలో ప్రజలు వచ్చారు. గతంలో ఇది అసాధ్యం, కానీ ఇప్పుడు భారతదేశం మారుతోంది. ఈ మ్యాచ్ ‘రాయల్ ప్రీమియర్ లీగ్’లో భాగంగా జరిగిందన్నారు.
దేశంలో మొట్టమొదటి ‘ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్’ అందరి దృష్టిని ఆకర్షించిందన్నారు. ఇది కూడా శ్రీనగర్‌లోని దాల్ సరస్సులో జరిగిందని, నిజంగా, అటువంటి ఉత్సవాన్ని నిర్వహించడానికి శ్రీనర్ ఒక ప్రత్యేక ప్రదేశమన్నారు. భారతదేశం నలుమూలల నుంచి 800 మందికి పైగా అథ్లెట్లు ఇందులో పాల్గొన్నారని తెలిపారు. మహిళా అథ్లెట్లు వెనుకబడి లేరని, వారి భాగస్వామ్యం దాదాపు పురుషులతో సమానంగా ఉందని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరినీ అభినందించారు.
READ ALSO: Man Kills Wives: బిహార్‌లో దారుణం.. ముగ్గురిని పెళ్లాడి.. ఇద్దరిని చంపేశాడు..