లక్షద్వీప్‌కు పర్యాటకుల సంఖ్య అమాంతంగా పెరిగింది. ఒకప్పుడు అంతంత మాత్రంగానే టూరిస్టులు వచ్చేశారు. కానీ జనవరిలో ప్రధాని మోడీ పర్యటన తర్వాత.. ఒక్కసారిగా పర్యాటకులు సంఖ్య పెరిగింది. దీనికి పర్యాటక శాఖ ఓ కీలక ప్రకటన చేసింది. ప్రధాని మోడీ లక్షద్వీప్ దీవులను సందర్శించిన అనంతరం ఆ ప్రాంతంలో పర్యటకుల సంఖ్య పెరిగిందని అక్కడి పర్యటకశాఖ అధికారి ఇంతియాస్ మహ్మద్ తెలిపారు.
అంతర్జాతీయ, విదేశీ పర్యటకులు ఈ ద్వీపాన్ని సందర్శించడానికి ప్యాకేజీల కోసం తమను సంప్రదిస్తున్నారని, ఆన్‌లైన్‌లో కూడా శోధిస్తున్నారని వెల్లడించారు.లక్షద్వీప్‌కు వాయు రవాణాను మెరుగుపరచడం వల్ల పర్యటకులను ఆకర్షించే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోడీ జనవరిలో కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్‌ను సందర్శించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని తన ‘ఎక్స్’ ఖాతాలో పంచుకున్నారు. ఇది ఎంతో అద్భుతమైన అనుభవమని ఆయన పేర్కొన్నారు.
ఇక విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందిస్తూ ప్రధాని మోడీ లక్షద్వీప్ పర్యటన ఈ ప్రాంతంలోని పర్యటక రంగాన్ని ప్రభావితం చేస్తుందన్నారు. దీనివల్ల పెద్ద మొత్తంలో సందర్శకులు లక్షద్వీప్ అభివృద్ధికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.