Big Breaking: తెలంగాణకు పసుపు బోర్డు.. ములుగు జిల్లాకు సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi on National Turmeric Board: మహబూబ్‌నగర్‌లో ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. తెలంగాణలో రూ.13,500 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ.1932 కోట్ల వ్యయంతో కృష్ణపట్నం-హైదరాబాద్ మల్టీ ప్రోడక్ట్ పైప్‌లైన్, వరంగల్-ఖమ్మం-విజయవాడ హైవే పనులకు శంకుస్థాపన చేశారు. మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నా కుటుంబ సభ్యులారా.. అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సభా వేదికగా ప్రధాని మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న పసుపు రైతుల కల సాకారమైంది. సభా వేదికగా పసుపు బోర్డుపై ప్రధాని మోడీ కీలక ప్రకటన చేశారు. తెలంగాణకు పసుపు బోర్డు ఇస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు. పసుపు రైతుల సంక్షేమం కోసం జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నామని మోడి ప్రకటించారు. పాలమూరు సభ సాక్షిగా ప్రధాని ప్రకటించారు.
Also Read: Rajnath Singh: అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే.. రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
దీంతో పాటు ములుగు జిల్లాకు సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని ప్రధాని మోడీ సభా వేదికగా ప్రకటించారు. సమ్మక్క సారక్క పేరుతో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. దేశంలో పండగల సీజన్ నడుస్తోందని, పార్లమెంట్లో నారీశక్తి బిల్లును ఆమోదించుకున్నామన్నారు. రాష్ట్రంతో పాటు, దేశంలో రవాణా సదుపాయాలు మెరుగవుతాయని మోడీ ప్రకటించారు. పదే పదే నా కుటుంబ సభ్యుల్లారా అంటూ తెలుగులో మాట్లాడిన ప్రధాని మోడీ.. నేడు అనేక రోడ్ కనెక్టివీటీ ప్రాజెక్టులు ప్రారంభించుకున్నామన్నారు. నవరాత్రికి ముందే శక్తి పూజలు ప్రారంభించుకున్నామన్నారు. రోడ్డు ప్రాజెక్టుల ద్వారా ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రవాణా సదుపాయాలు మెరుగవుతాయని ప్రధాని తెలిపారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!