రామప్ప దేవాలయానికి గొప్ప చరిత్ర ఉందని మంత్రి సీతక్క అన్నారు. ఇవాళ ఆమె మాట్లాడుతూ.. అందుకే ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించిందని, తెలంగాణలో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఏకైక కట్టడం రామప్ప దేవాలయమన్నారు సీతక్క. అందుకే రామప్ప కీర్తిని చాటేలా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, అన్ని శాఖలు సమన్వయంతో గడువులోపు పనులు పూర్తి చేయాలన్నారు. పనుల్లో అలసత్వం వహిస్తే చరిత్ర, ప్రజలు క్షమించరని, రామప్ప చుట్టుపక్కల ఎన్నో చారిత్రక ప్రాంతాలు, టూరిజం…