PM Modi: తొమ్మిదేళ్ల తర్వాత ఇజ్రాయెల్‌లో మోడీ పర్యటన.. ‘నెస్సెట్’లో మార్మోగిన భారత్ పేరు!
- మోడీకి ఘనస్వాగతం పలికిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దంపతులు
- ఇజ్రాయెల్ పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా మోడీ రికార్డు
- టెర్రరిజంపై ప్రపంచ దేశాలు కలసికట్టుగా పోరాడాలని పిలుపు
- ఉగ్రవాదానికి భారత్ పూర్తిగా వ్యతిరేకం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని మోడీ చివరిసారిగా 2017లో ఇజ్రాయెల్‌ను సందర్శించారు. మళ్లీ తొమ్మిది సంవత్సరాల తర్వాత ఆయన ఇజ్రాయెల్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన బంధం మరోసారి ప్రపంచానికి చాటిచెప్పబడింది. విమానాశ్రయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దంపతులు మోడీకి ఘనస్వాగతం పలికారు. ఇజ్రాయెల్ పార్లమెంట్ అయిన ‘నెస్సెట్’ ను ఉద్దేశించి ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా మోడీ రికార్డు సృష్టించారు. ఆయన పార్లమెంటులోకి రాగానే సభ్యులందరూ లేచి నిలబడి చప్పట్లతో, “మోడీ.. మోడీ” అనే నినాదాలతో స్వాగతం పలికారు.
READ ALSO: Operation Crackdown: సైబర్ నేరాలపై ‘ఆపరేషన్ క్రాక్‌డౌన్’ ప్రారంభం
Also Read
- Mallikarjun Kharge: లోక్‌సభ స్థానాలు పెంచొద్దు.. ప్రధానికి ఖర్గే లేఖ..
- TVS Jupiter Dual Tone Spectral లాంచ్.. రూ.89,825కే.. అదిరిపోయే మైలేజ్, ఫీచర్లు..!
- MOTN Survey 2026: మళ్లీ బీజేపీదే అధికారం.. ఇప్పుడే ఎన్నికలు జరిగితే ఎన్డీయేకు 326 సీట్లు..
- Nepal Floods: వేళ్లన్నీ డ్రాగన్ వైపే.. విలయానికి చైనా నిర్మాణాలే కారణమా?
నెస్సెట్ స్పీకర్ అమీర్ ఒహానా హిందీలో “నమస్తే”, “జెరూసలేంకు స్వాగతం” అని మోడీకి ఆహ్వానం పలికారు. “భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశం. ముంబై దాడుల సమయంలోనైనా, పహల్గామ్ ఘటనలోనైనా ఇజ్రాయెల్ ఎప్పుడూ భారత్‌కు అండగా ఉంటుంది” అని ఆయన స్పష్టం చేశారు. అలాగే, యూదులకు ఆశ్రయం ఇచ్చిన దేశంగా భారత్‌పై గౌరవాన్ని ప్రకటించారు. అనంతరం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ.. మోడీ కౌగిలింత (ఆలింగనం) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “మోడీ ఎవరినైనా కౌగిలించుకుంటే అది కేవలం పైపైన చేసే పని కాదు, అది హృదయపూర్వకమైనది, దానినే ప్రపంచవ్యాప్తంగా ‘మోడీ హగ్’ అని పిలుస్తున్నారు. నాకు నరేంద్ర మోడీ మిత్రుడు మాత్రమే కాదు.. సోదరుడి కంటే ఎక్కువ. మోడీ.. భారత్‌ను అత్యంత వేగంగా అభివృద్ధి చేస్తున్నారు. అలాగే ఇజ్రాయెల్‌కు మోడీ ప్రధాన స్నేహితుడు, భారత్‌తో వాణిజ్య ఒప్పందాలు రెట్టింపు అయ్యాయి, ఇరుదేశాల మధ్య అనుబంధాన్ని మాటల్లో వర్ణించలేం, ప్రస్తుతం రెండు దేశాల మధ్య సహకారం 4 రెట్లు పెరిగిందని అన్నారు. భారతదేశం 140 కోట్ల జనాభాతో ఒక మహాశక్తి అని, ఇజ్రాయెల్ చిన్న దేశమైనా సాంకేతికంగా చాలా పెద్దదని అన్నారు. ఈ రెండు దేశాల కలయిక వల్ల ప్రపంచంలో పనితీరు, సామర్థ్యం, భావోద్వేగాలు రెట్టింపు అవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా యూదులపై దాడులు లేదా వ్యతిరేకత పెరిగిన చరిత్ర ఉన్నప్పటికీ, భారతదేశం మాత్రం యూదులను ఎప్పుడూ వేధించలేదని, పైగా సాదరంగా ఆహ్వానించిందని నెతన్యాహు గుర్తు చేసుకున్నారు. ఈ గొప్ప మనసున్న భారత్‌కు ఆయన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో ప్రసంగించడం గౌరవంగా భావిస్తున్నా. భారత్, ఇజ్రాయెల్.. ప్రాచీన నాగరికత కలిగిన దేశాలు. ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో ప్రసంగించిన తొలి భారత ప్రధానిని నేనే. ఇజ్రాయెల్‌కు రెండోసారి రావడం సంతోషంగా ఉంది. ఇజ్రాయెల్‌తో 140 కోట్ల భారతీయుల స్నేహం ముడిపడి ఉంది. ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7న జరిగిన హమాస్ దాడుల పట్ల నా ప్రగాఢ సానుభూతి, టెర్రరిజాన్ని ఉపేక్షించేది లేదు. రెండోమాట ప్రసక్తే లేదు, టెర్రరిజంపై ప్రపంచ దేశాలు కలసికట్టుగా పోరాడాలి. టెర్రరిజం ఎక్కడున్నా నిర్మూలించేందుకు భారత్ సహకరిస్తుంది. ఉగ్రవాదానికి మేం పూర్తిగా వ్యతిరేకం. ఉగ్రవాదంపై పోరులో ఇజ్రాయెల్‌కు పూర్తిగా అండగా ఉన్నాం’ అని అన్నారు. భారత్ కొన్ని దశాబ్దాలుగా ఉగ్రవాదంతో పోరాడుతోంది. హమాస్ దాడి చేసి పౌరులను చంపడం చాలా దారుణం. హమాస్ దాడుల తర్వాత మీ బాధలను మేము పంచుకున్నాం. ఇజ్రాయెల్ పౌరుల హత్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించలేమని ఈ సందర్భంగా ప్రధాని అన్నారు.
READ ALSO: Healthy Recipes: పత్యం ఉన్నవారికీ అమృతంలాంటి కారప్పొడి.. ఇంట్లోనే సింపుల్‌గా ఇలా చేసుకోండి!
తాజావార్తలు
-
Kishan Reddy : జీవో 97పై బీజేపీ ఫైర్.. విద్యార్థులకు అండగా కిషన్ రెడ్డి.!
-
Mallikarjun Kharge: లోక్‌సభ స్థానాలు పెంచొద్దు.. ప్రధానికి ఖర్గే లేఖ..
-
TVS Jupiter Dual Tone Spectral లాంచ్.. రూ.89,825కే.. అదిరిపోయే మైలేజ్, ఫీచర్లు..!
-
MOTN Survey 2026: మళ్లీ బీజేపీదే అధికారం.. ఇప్పుడే ఎన్నికలు జరిగితే ఎన్డీయేకు 326 సీట్లు..
-
Nepal Floods: వేళ్లన్నీ డ్రాగన్ వైపే.. విలయానికి చైనా నిర్మాణాలే కారణమా?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!