PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇథియోపియా ప్రస్తుతం పర్యటనలో ఉన్నారు. మంగళవారం ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీ ఆయనకు దేశ అత్యున్నత పురస్కారం “ది గ్రేట్ హానర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా”తో సత్కరించారు. తాజాగా ఇథియోపియా పార్లమెంట్ సంయుక్త సమావేశంలో ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశం, ఇథియోపియా మధ్య సంబంధాలను ప్రశంసించారు. ఈరోజు మీ ముందు నిలబడటం తనకు లభించిన గొప్ప గౌరవమని.. సింహాల భూమి అయిన ఇథియోపియాలో నిలబడటం చాలా అద్భుతంగా ఉందని కొనియాడారు.. భారత్లోని 140 కోట్ల ప్రజల తరుఫున శుభాకాంక్షలు తెలిపారు. మోడీ ఇప్పటికే ప్రపంచంలోని 17పార్లమెంట్లలో ప్రసంగించారు. ఇది ఆయనకు 18 పార్లమెంట్ ప్రసంగం.
READ MORE: Bihar CM Hijab Incident: బీహార్ సీఎం ఆమెను ఇంకెక్కడో తాకి ఉంటే?.. యూపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
భారతదేశ జాతీయ గేయం ‘వందేమాతరం’, ఇథియోపియా జాతీయ గీతం రెండూ మన భూమిని తల్లిగా సూచిస్తాయని ప్రధాని మోడీ తెలిపారు. వారసత్వం, సంస్కృతి పట్ల ప్రజలు గర్వపడాలని, మాతృభూమిని రక్షించడానికి ఇవి మనల్ని ప్రేరేపిస్తాయన్నారు. ఇథియోపియా చరిత్ర ఎంతో పురాతనమైనది. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ నినాదంతో మేం ముందుకు వెళ్తున్నాం. వసుధైక కుటుంబానికి భారత్ కట్టుబడి ఉంటుంది. ప్రపంచమంతా ఒకే కుటుంబం అని నమ్ముతాం. భిన్నప్రాంతాలు, మతాలు, సంస్కృతులు ఉన్నప్పటికీ మనుషులంతా ఒక్కటే అని మోడీ వెల్లడించారు. ఈ భవనంలో చట్టాలు రూపొందిస్తారు. ఇక్కడ ప్రజల సంకల్పం, దేశ సంకల్పంగా మారుతుందన్నారు. దేశ సంకల్పం ప్రజల సంకల్పానికి అనుగుణంగా ఉన్నప్పుడు మాత్రమే అభివృద్ధి ముందుకు సాగుతుందని హితవు పలికారు. ఈ వేదిక ద్వారా పొలాల్లో పనిచేసే రైతులు, కొత్త ఆలోచనలను సృష్టించే వ్యవస్థాపకులు, సంఘాలకు నాయకత్వం వహించే మహిళలు, దేశ భవిష్యత్తును రూపొందిస్తున్న ఇథియోపియా యువతతో తాను సంభాషిస్తున్నానని ప్రధాని అన్నారు. ఇథియోపియా అభివృద్ధిని కొనియాడారు.
READ MORE: Pakistan-BLA: పాకిస్తాన్ సైన్యంపై విరుచుకుపడ్డ బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA).. 12 మంది సైనికులు మృతి..!
కాగా.. మోడీకి ఎథియోపియా అత్యున్నత పురస్కారం ‘ది గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఎథియోపియా’ను ఎథియోపియా ప్రధాని అబియ్ అహ్మద్ అలీ ప్రదానం చేశారు. ఈ పురస్కారాన్ని అడిస్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని మోడీకి అందజేశారు. భారత్–ఎథియోపియా సంబంధాలను బలపర్చడంలో చేసిన విశేష కృషికి, నాయకత్వానికి గుర్తింపుగా ఈ అవార్డు ఇచ్చినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఈ పురస్కారాన్ని అందుకున్న ప్రపంచంలోనే తొలి దేశాధినేత లేదా ప్రభుత్వాధినేత ప్రధాని నరేంద్ర మోడీ కావడం విశేషం. “నాకు ‘గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఎథియోపియా’ పురస్కారం లభించడం గౌరవంగా ఉంది. దీన్ని భారతదేశంలోని 140 కోట్ల ప్రజలకు అంకితం చేస్తున్నాను” అని ప్రధాని మోడీ ఎక్స్ (X)లో పోస్టు చేశారు.
Honoured to address the Ethiopian Parliament. Watch my speech. https://t.co/fxEZ7EAnFW
— Narendra Modi (@narendramodi) December 17, 2025
ዛሬ ጠዋት ለኢትዮጵያ ፓርላማ ንግግር ማድረጌ ትልቅ ክብርና እድል ነበር። የኢትዮጵያ የበለፀገ ታሪክ፣ ባህልና መንፈስ ጥልቅ አክብሮትና አድናቆትን ያነሳሳል። ህንድ በጋራ እሴቶች፣ በጋራ መተማመን እና ለሰላም፣ ለልማትና ለትብብር የጋራ ራዕይ… pic.twitter.com/S4iqBecyeE
— Narendra Modi (@narendramodi) December 17, 2025