PM Modi: గ్రీస్‌లో ప్రధాని మోడీకి అత్యున్నత గౌరవం.. పురస్కారంతో సత్కరించిన గ్రీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: గ్రీస్‌లో పర్యటించిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి అత్యున్నత గౌరవం దక్కింది. ప్రధాని మోడీకి గ్రీస్‌లోని ఏథెన్స్‌లో శుక్రవారం ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆనర్ అవార్డు’ లభించింది. గ్రీస్ అధ్యక్షురాలు కాటెరినా ఎన్ సకెల్లారోపౌలౌ గ్రీస్‌లో ప్రధాని మోడీ అధికారిక పర్యటన సందర్భంగా ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆనర్’ను ప్రదానం చేశారు. ఇది గ్రీస్ దేశంలో రెండో అత్యున్నత పురస్కారం. దీనిపై ప్రధాని మోడీ ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. గ్రీస్ అధ్యక్షురాలు కాటెరినా సకెల్లారోపౌలౌ, అక్కడి ప్రభుత్వానికి, గ్రీస్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఇది భారతదేశం పట్ల గ్రీస్ ప్రజలకు ఉన్న గౌరవాన్ని తెలియజేస్తుందని ప్రధాని ట్వీట్ చేశారు.
ప్రధాని మోదీ ఒకరోజు పర్యటన నిమిత్తం గ్రీస్ చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రయాన్-3 విజయం భారత్‌కే కాదు.. యావత్ మానవాళికి దక్కిన విజయం అని గ్రీస్ అధ్యక్షురాలు కటారినా ఎన్ సకెల్లారోపౌలౌతో ప్రధాని మోడీ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గ్రీస్ ప్రధాని కిరియాకోస్ మిత్సోటాకిస్‌తో ప్రతినిధి స్థాయి చర్చలు కూడా జరిపారు. ఆర్డర్ ఆఫ్ హానర్ పురస్కారం 1975లో స్థాపించబడింది. గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆనర్‌ను గ్రీస్ ప్రెసిడెంట్ ప్రధానమంత్రులు, ప్రముఖ వ్యక్తులకు ప్రదానం చేస్తారు.
Also Read
- Most Beautiful Waterfalls in India: భారతదేశపు నయాగరా నుంచి దూద్‌సాగర్ వరకు.. సందర్శించాల్సిన టాప్ జలపాతాలు ఇవే..
- IAF AN-32: అస్సాంలో IAF AN-32 విమానానికి ప్రమాదం.. ల్యాండింగ్ తర్వాత ఒక్కసారిగా మంటలు!
- FIFA World Cup 2026: అమెరికా గోల్స్ వర్షం.. పరాగ్వేపై 4-1 తేడాతో భారీ విజయం.!
- Virat Kohli: "ప్రత్యర్థిగా మొదలై మంచి స్నేహితుడిగా మారావు".. కేన్ రిటైర్మెంట్పై విరాట్ కోహ్లీ ఎమోషనల్!
Read Also: Supreme Court: సత్యేందర్ జైన్ మధ్యంతర బెయిల్ సెప్టెంబర్ 1 వరకు పొడిగింపు
గ్రీస్ పర్యటనలో ఉన్న ప్రధాని ఆ దేశ ప్రధాని కిరియాకోస్ మిత్సోటాకిస్‌తో సమావేశమై ఇరు దేశాల మధ్య సంబంధాలపై చర్చించారు. భేటీ అనంతరం మాట్లాడిని మోడీ..వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, సాంకేతికత, మౌలిక సదుపాయాలు, విద్య, డిజిటల్ చెల్లింపులు, ఫార్మా, పర్యాటకం, వ్యవసాయం తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు. భారత్- గ్రీస్ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామిగా ముందుకు తీసుకెళ్లేందుకు ఇరు దేశాలు అంగీకరించినట్లు తెలిపారు. భారత ప్రధాని మోడీ దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ సమావేశాలు ముగిసిన అనంతరం నేడు గ్రీస్‌కు వెళ్లారు. గ్రీస్ ప్రధాని కిరియాకోస్ మిత్సోటాకిస్ ఆహ్వానంపై మోదీ గ్రీస్ పర్యటనకు వెళ్లారు. గత 40 ఏళ్లలో భారత ప్రధాని గ్రీస్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.
తాజావార్తలు
-
Most Beautiful Waterfalls in India: భారతదేశపు నయాగరా నుంచి దూద్‌సాగర్ వరకు.. సందర్శించాల్సిన టాప్ జలపాతాలు ఇవే..
-
IAF AN-32: అస్సాంలో IAF AN-32 విమానానికి ప్రమాదం.. ల్యాండింగ్ తర్వాత ఒక్కసారిగా మంటలు!
-
FIFA World Cup 2026: అమెరికా గోల్స్ వర్షం.. పరాగ్వేపై 4-1 తేడాతో భారీ విజయం.!
-
Virat Kohli: “ప్రత్యర్థిగా మొదలై మంచి స్నేహితుడిగా మారావు”.. కేన్ రిటైర్మెంట్పై విరాట్ కోహ్లీ ఎమోషనల్!
-
AK64 : రెమ్యూనరేషన్ చిక్కుల్లో తల… 200 నుంచి 100 కోట్లకు పడిపోయిందా ?
ట్రెండింగ్
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్‌ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!