Bomb Treat : షార్జా నుండి హైదరాబాద్‌కు వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో విమానాన్ని అత్యవసరంగా అహ్మదాబాద్‌కు మళ్లించారు. ఈ సంఘటన ప్రయాణికులలో, విమానాశ్రయ అధికారులలో కలకలం సృష్టించింది. ఇండిగో విమానానికి సంబంధించిన అధికారులకు ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు అందింది. విమానంలో “మానవ ఐఈడీ (IED)” ఉన్నట్లుగా ఈ మెయిల్ ద్వారా బెదిరించినట్లు తెలిసింది. బెదిరింపు రాగానే అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. Keeravani : గ్లోబల్ సమ్మిట్ లో కీరవాణి కచేరి ఎలాంటి ప్రమాదం…
అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ప్రపంచ వ్యాప్తంగా విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలు కలవర పెడుతున్నాయి. తాజాగా జపాన్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. అసోసియేటెడ్ ప్రెస్ (AP) ప్రకారం.. జపాన్ ఎయిర్‌లైన్స్ విమానం దాదాపు 36,000 అడుగుల ఎత్తు నుంచి అకస్మాత్తుగా కిందికి వెళ్లింది. దీంతో సిబ్బంది వెంటనే ప్రయాణికులకు ఆక్సిజన్ మాస్క్‌లు అందించారు. ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. కౌలంపూర్ నుంచి శంషాబాద్ వస్తున్న ఎయిర్ ఏషియా ఇంటర్నేషనల్ విమానం గాలిలో ఉండగానే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది.
Flight Emergency: అమెరికాలో ఓ విమానం తృటిలో ప్రమాదం నుంచి బయటపడింది. 10 నిమిషాల్లోనే ఏకంగా 28,000 అడుగుల దిగువకు విమానం చేరింది. దీంతో ఒక్కసారిగా ప్రయాణికులు గుండె జారిన పనైంది. చివరకు ఎలాగొలా సేఫ్ ల్యాండింగ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. యునైటెడ్ ఎయిర్‌లైన్స్ కి చెందిన విమానం బుధవారం అమెరికా నేవార్క్ నుంచి రోమ్‌కి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.