IPL 2025 Auction: విరాట్ కెప్టెన్ అయితే.. అతడి కోసం కచ్చితంగా ట్రై చేస్తాడు!
- జడ్డాలో ఐపీఎల్ 2025 మెగా వేలం
- స్టార్ ఆటగాళ్లను కొనేందుకు సిద్దమైన ఆర్‌సీబీ
- విరాట్ కెప్టెన్ అయితే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నవంబర్ 24, 25 తేదీల్లో ఐపీఎల్ 2025 మెగా వేలం సౌదీ అరేబియాలోని జడ్డాలో జరగనుంది. వేలానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ముగ్గురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకుంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (రూ.21 కోట్లు)ని టాప్ రిటెన్షన్‌గా తీసుకోగా.. బ్యాటర్ రజత్ పాటిదార్ (రూ.11 కోట్లు), పేసర్ యశ్ దయాళ్ (రూ.5 కోట్లు)ను అట్టిపెట్టుకుంది. ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహమ్మద్ సిరాజ్ లాంటి స్టార్ ఆటగాళ్లను వేలంలోకి వదిలేసింది. రూ.83 కోట్ల పర్స్ మనీతో మంచి ఆటగాళ్లను కొనేందుకు ఆర్‌సీబీ సిద్దమైంది.
ఆర్‌సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ మరలా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే బెంగళూరు వేలంపై స్టార్ స్పోర్ట్స్ షో ‘గేమ్ ప్లాన్’లో టీమిండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ స్పందించాడు. ఆర్‌సీబీ కెప్టెన్‌గా కోహ్లీ బాధ్యతలు స్వీకరిస్తే.. స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్‌ను తీసుకునేందుకు ప్రయత్నిస్తాడని తెలిపాడు. ‘చహల్‌ను దక్కించుకోవడం ఆర్‌సీబీకి చాలా కష్టమని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆర్ అశ్విన్, చహల్ భాగస్వామ్యాన్ని కొనసాగించడానికి రాజస్థాన్ రాయల్స్ ప్రయత్నం చేస్తుంది. విరాట్ కెప్టెన్ అయితే పాత ట్రంప్ కార్డు చహల్‌ను తిరిగి జట్టులో చేర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆర్‌సీబీ కెప్టెన్‌గా కోహ్లీ వస్తే జట్టులో చాలా మార్పులు జరుగుతాయి’ అని సంజయ్ అన్నాడు.
Also Read
- WWDCలో పొరపాటున 'ఫోల్డబుల్ ఐఫోన్' వివరాలు లీక్ చేసుకున్న Apple.!
- Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
- BAN vs AUS: ఆసీస్‌పై పంజా విసిరిన బంగ్లాదేశ్.! 86 పరుగుల తేడాతో భారీ విజయం..
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
Also Read: AUS vs IND: ఆస్ట్రేలియాకు షాక్.. పెర్త్ టెస్ట్‌కు కీలక వ్యక్తి దూరం! కారణం ఐపీఎల్
ఐపీఎల్ 2024లో రాజస్థాన్ రాయల్స్ తరఫున చహల్ 15 ఇన్నింగ్స్‌లలో 9.41 ఎకానమీ రేటుతో 18 వికెట్లు తీశాడు. 160 ఐపీఎల్ మ్యాచులలో యూజీ 205 వికెట్స్ పడగొట్టాడు. ఆర్‌సీబీ తరఫున 112 ఇన్నింగ్స్‌లలో 7.58 ఎకానమీ రేటుతో 139 వికెట్స్ తీశాడు. ఈ లెగ్ స్పిన్నర్ ఆర్‌సీబీ తరఫున ఇప్పటికీ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్నాడు. గతంలో ఎన్నో మ్యాచులలో ఆర్‌సీబీ అద్భుత విజయాలను చహల్ అందించాడు. ఐపీఎల్ 2025 వేలంలో చహల్‌కు భారీ ధర పలికే అవకాశం ఉంది. మరి ఏ జట్టు అతడిని సొంతం చేసుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Pakistan Airstrikes Afghanistan: ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 13 మంది మృతి
-
Money: జీతం పెరుగుతున్నా చేతిలో డబ్బు మిగలడం లేదా? మధ్యతరగతి ఎక్కువగా చేసే పొరపాటు ఇదే!
-
NBK 111 : బాలయ్య న్యూ ఏజ్ విధ్వంసానికి ముహూర్తం ఫిక్స్.. గెట్ రెడీ
-
Ben Stokes Retirement: బెన్ స్టోక్స్ సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై?
-
Jayam Ravi Divorce Case : మళ్ళీ కోర్టు మెట్లెక్కిన జయంరవి భార్య… ఈసారి ఏమైందంటే ?
ట్రెండింగ్
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?