Gopichand: విలన్‌గా గోపీచంద్ రీ-ఎంట్రీ? అసలు నిజం బయటపెట్టిన టీమ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gopichand: టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ మళ్లీ విలన్‌గా రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారా? త్వరలోనే ఒక తమిళ సినిమాలో విలన్ పాత్రలో కనిపించబోతున్నారా? గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఇదే చర్చ జోరుగా నడుస్తోంది. కెరీర్ మొదట్లో ‘జయం’, ‘నిజం’, ‘వర్షం’ లాంటి సినిమాలతో విలన్‌గా తనకంటూ ఒక స్పెషల్ మార్క్ వేసుకున్న గోపీచంద్, మళ్లీ నెగటివ్ రోల్ చేయడానికి ఒప్పుకున్నారనే వార్తలు వైరల్ కావడంతో ఫ్యాన్స్‌లోనూ కన్ఫ్యూజన్ మొదలైంది. అయితే, ఈ ప్రచారానికి గోపీచంద్ టీమ్ తాజాగా ఫుల్స్టాప్ పెట్టి అసలు నిజాన్ని బయటపెట్టింది.
తమిళ సినిమాలో గోపీచంద్ విలన్‌గా నటిస్తున్నారంటూ వస్తున్న వార్తలపై గోపీచంద్ టీమ్ అఫీషియల్‌గా స్పందించింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ వార్తలన్నీ పూర్తిగా అబద్ధమని, అందులో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దని మీడియా సంస్థలను, సోషల్ మీడియా పేజీలను కోరింది. హీరో గోపీచంద్ నెక్స్ట్ సినిమాలకు సంబంధించి ఎలాంటి కొత్త విషయాలు ఉన్నా, లేదా అఫీషియల్ అనౌన్స్మెంట్స్ చేయాలన్నా నేరుగా తమ అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారానే చెప్తామని టీమ్ క్లారిటీ ఇచ్చింది. దయచేసి ఇలాంటి రూమర్లను నమ్మవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేసింది. మొత్తానికి, విలన్‌గా గోపీచంద్ రీ-ఎంట్రీ అంటూ సాగిన ప్రచారానికి ఈ ఒక్క ప్రకటనతో తెరపడినట్లు అయ్యింది.
Also Read
- Dhanush: ‘ఓం’ రిలీజ్ వేళ ధనుష్ స్పెషల్ నోట్.. ఫ్యాన్స్‌కు కీలక విజ్ఞప్తి!
- Shivathmika Rajasekhar: నాకు సినిమాలంటే పిచ్చి.. "రేపు నా కల నిజమవుతోంది"!
- Nayanthara : "నేను మదర్ థెరిసాను కాను" అయితే ఏంటి? నయనతార కీలక వ్యాఖ్యలు!
- Varanasi: రాజమౌళి - మహేశ్ 'వారణాసి'కి ఐపీఎల్ గండం.. ఏప్రిల్ 7న రావడం కష్టమేనా?
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
Gopichand: విలన్‌గా గోపీచంద్ రీ-ఎంట్రీ? అసలు నిజం బయటపెట్టిన టీమ్!
-
IPL 2027: KKR వాటా విక్రయానికి రంగం సిద్ధం.. 400 మిలియన్ డాలర్లకు భారీ డీల్..
-
Aus Vs Eng: ఆస్ట్రేలియాను చిత్తు చేసిన ఇంగ్లాండ్.. 2-1తో వన్డే సిరీస్ కైవసం..
-
Healthy Vegetarian Recipes: గుమ్మడికాయ అంటే ముఖం చిట్లిస్తున్నారా? రెస్టారెంట్ స్టైల్లో ఇలా చేసి చూడండి.. మెతుకు వదలరు!
-
Ukraine: ‘‘పుతిన్‌ను బుజ్జగించడం కన్నా ఇలా చేయండి’’..ట్రంప్, జిన్పింగ్లకు ఉక్రెయిన్ విజ్ఞప్తి
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..