యంగ్ హీరోయిన్ నేహా శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.డీజే టిల్లు’ సినిమా తో ఈ యంగ్ హీరోయిన్ నేహా శెట్టి అదిరిపోయే క్రేజ్ ను దక్కించుకుంది.రాధికా క్యారెక్టర్ లో ఎంతో హాట్ గా కనిపించి ప్రేక్షకులను ఎంతగానో ఫిదా చేసింది.డీజే టిల్లు సినిమా ఈ భామకు అదిరిపోయే బ్రేక్ ఇచ్చింది.ప్రస్తుతం ఈ భామ వరుస చిత్రాలతో బిజీ గా ఉంది.. డీజే టిల్లు సినిమా తరువాత ఈ భామ మరో మూడు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. యంగ్ హీరో కార్తీకేయ సరసన ‘బెదురులంక 2012’ సినిమా లో ఈ భామ హీరోయిన్ గా నటిస్తుంది.తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల అయి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
అలాగే మాస్ కా దాస్ విశ్వక్ సేన్ సరసన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం నుంచి నిన్న విడుదలైన ‘సుట్టమ్లా సూసి’ సాంగ్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈ పాటలో నేహా అందాలకు ప్రేక్షకులు పిచ్చెక్కిపోతున్నారు.అలాగే నేహా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సరసన ‘రూల్స్ రంజన్’ సినిమా లో కూడా నటిస్తోంది. ఈ చిత్రం నుండి విడుదలయిన సమ్మోహనుడా సాంగ్ ట్రెండింగ్ గా నిలిచింది.ఈ మూడు చిత్రాలకు నేహా తన గ్లామర్ స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పవచ్చు.. నేహా సోషల్ మీడియా లో కూడా ఎంతో యాక్టీవ్ గా కనిపిస్తుంది. వరుసగా హాట్ ఫొటోషూట్లు చేస్తూ ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో మెరుస్తూ రెచ్చగొడుతుంది.తాజాగా నేహా ఆరెంజ్ డ్రెస్ లో మెరిసింది..మత్తెక్కించే చూపుల తో టెంప్టింగ్ ఫోజులిచ్చి ఈ యంగ్ బ్యూటీ కుర్రాళ్ల కు నిద్ర లేకుండా చేస్తుంది.ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి.ఈ పిక్స్ నెటిజన్స్ హాట్ గా కామెంట్స్ కూడా పెడుతున్నారు