ఉత్తరాఖండ్‌లో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు పర్యాటకులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. దీంతో చార్ ధామ్ టూర్ లో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొండ చరియలు విరిగిపడటంతో నిన్నటి నుంచి రోడ్లపైనే యాత్రికులు ఉంటున్నారు. శ్రీనగర్ – రిషికేష్ మార్గంలో కొడియాల దగ్గర భారీగా వాహనాలు ఆగిపోయాయి. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వేల సంఖ్యలో యాత్రికులు ఇక్కట్లు పడుతున్నారు. ముందుకు సాగలేక వెనక్కి వెళ్ళలేక యాత్రికులు నానా అవస్థలు పడుతున్నారు.
Read Also: Stock Market Opening: లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 66,000 పైన, నిఫ్టీ 19600
కొండచరియలు విరిగిపడడంతో వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. దీంతో వేలాదిమంది యాత్రికులు రోడ్లపై చిక్కుకుపోయారు. మరీ ముఖ్యంగా రిషికేశ్‌కు సుమారు 40 కిలోమీటర్ల దూరంలో వందలాదిమంది యాత్రికులు చిక్కుకుపోయి.. బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. యాత్రికులతో పాటు స్థానికులు కూడా రోడ్లపైనే పడిగాపులు కాస్తున్నారు. కొడియాల దగ్గర దాదాపు 1500 వాహనాలు, 20 వేల మంది యాత్రికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, బెంగళూరు నుంచి వెళ్లిన పలువురు తెలుగు యాత్రికులు కూడా వీరిలో ఉన్నట్లు సమాచారం. తిరుగు ప్రయాణంలో ఉండగా వీరంతా ఇలా చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది.
Read Also: Suicide Attempt: నిన్న ప్రియుడు, నేడు ప్రియురాలు ఆత్మహత్యయత్నం..
అయితే, భారీ వర్షాలతో తరచుగా రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. గతంలో కూడ ఈ తరహా ఘటనలు చాలా చోటు చేసుకున్నాయి. వర్షాకాలంలో ఇలాంటి ఘటనలు జరుగుతేనే ఉంటాయి. ఈ ఏడాది జూన్ 23న కూడ కొండచరియలు విరిగిపడి వాహనాలు రోడ్డుపైనే ఆగిపోయాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సమయంలో రోడ్డుపైనే వందలాది వాహనాలు నిలిచిపోయి యాత్రికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈ ఏడాది జూలై 12న ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల కారణంగా తొమ్మిది మంది యాత్రికులు మృతి చెందారు. 13 మంది గాయపడ్డారు. రిషికేష్ వద్ద గంగా నది ప్రమాదకరస్థాయిలో ప్రవహించింది.