డిజిటల్ పేమెంట్ ప్లాట్ ఫామ్ ఫోన్ పే తమ యూజర్స్ కోసం మరో న్యూస్ ను చెప్పింది.. ఇన్సూరెన్స్ తీసుకోవాలని అనుకొనే వారికి ఫోన్ పే తీపి కబురు చెప్పింది..ఫోన్‌పేలో యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీలు అందుబాటులో ఉన్నాయి. ప్రమాదవశాత్తు మరణిస్తే బీమా మొత్తం నామినీకి చెందుతుంది. ఎలాంటి హెల్త్ చెకప్స్ అవసరం లేదు. పాలసీ తీసుకోవచ్చు. తక్కువ డాక్యుమెంట్లతోనే మీరు పాలసీ పొందొచ్చు. ఎప్పుడైనా ఈ పాలసీ కొనొచ్చు. 24 గంటలూ సేవలు అందుబాటులో ఉంటాయి. మరణించినా, కంటి చూపు కోల్పోయినా, శాశ్వత అంగ వైకల్యం వచ్చిన బీమా మొత్తం పూర్తిగా లభిస్తుంది. 18 నుంచి 65 ఏళ్ల వరకు వయసు కలిగిన వారు ఈ పాలసీ తీసుకోవచ్చు.. తక్కువ భీమాతోనే కవర్ చేసుకోవచ్చు..
న్యాచురల్ డెత్ కు మాత్రమే ఇది వర్తిస్తుంది.. సూసైడ్ చేసుకొని మరణిస్తే వర్తించదు.. ఇక అలాగే యుద్ధం వంటి వాటిలో మరణించినా కూడా పాలసీ డబ్బులు రావు. డ్రగ్స్, లిక్కర్ తీసుకొని చనిపోయినా కూడా పాలసీ వర్తించదు. ఫోన్‌పే రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ భాగస్వామ్యంతో ఈ పాలసీని అందిస్తోంది. ప్రతి ఏటా మీరు ఈ పాలసీని రెన్యూవల్ చేసుకోవాల్సి టుంది. పాలసీ తీసుకున్న తర్వాత 15 రోజులు ప్రీ లుక్ పీరియడ్ ఉంటుంది. వద్దనుకుంటే పాలసీని వెనక్కి ఇవ్వొచ్చు…
ఇకపోతే ఈ పాలసీని రూ.50 వేల నుంచి రూ. 20 లక్షల వరకు మొత్తంతో మీరు యాక్సిడెంటల్ పాలసీ తీసుకోవచ్చు. రూ. 50 వేల బీమా మొత్తానికి ప్రీమియం రూ.20 చెల్లించాలి. అదే రూ. లక్ష బీమా మొత్తం అయితే ప్రీమియం రూ.49 పడుతుంది. ఇక రూ. 5 లక్షల బీమాకు అయితే ప్రీమియం రూ. 249 పడుతుంది. ఇంకా రూ. 10 లక్షల మొత్తానికి బీమా తీసుకోవాలని భావిస్తే.. రూ. 549 కట్టాలి. ఇక రూ. 20 లక్షల బీమా మొత్తానికి అయితే ప్రీమియం రూ. 1099 పడుతుంది..ఇందులో మీకు నచ్చిన పాలసీని తీసుకోవచ్చు..మీ కుటుంబానికి భరోసా ఇవ్వడం కోసం ఈ పాలసీని తీసుకోవడం ఉత్తమం..