Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దూకుడు పెంచింది. విచారణలో భాగంగా నేడు రెండో రోజు ప్రభాకర్‌రావును ప్రశ్నించనుంది. సిట్ కార్యాలయం నుంచి ఆయనను బషీర్‌బాగ్‌లోని సీసీఎస్‌కు తరలించి విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ ఆపరేషన్ వెనుక అసలు కుట్ర సూత్రధారి ఎవరు? ప్రభాకర్‌రావుకు ఎవరి నుంచి ఆదేశాలు వచ్చాయి? అనే కోణంలో సిట్ లోతుగా విచారణ చేస్తోంది. ఈ క్రమంలో ప్రభాకర్‌రావు, ప్రణీత్‌రావు ఇద్దరినీ ఒకేసారి ప్రశ్నించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్‌రావుకు ప్రభాకర్‌రావు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు? ఆ ఆదేశాల అమలు ఎలా జరిగింది? అనే అంశాలపై స్పష్టత తీసుకురావాలని సిట్ భావిస్తోంది.
READ MORE: TheRajaSaab : రాజాసాబ్ నాన్ థియేట్రికల్ రూమర్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నిర్మాత విశ్వప్రసాద్
గతంలో ఈ కేసులో నిందితులు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లను ఆధారంగా చేసుకుని నేటి విచారణ కొనసాగనుంది. అలాగే రాధాకిషన్‌రావు, ప్రణీత్‌రావులను మరోసారి విచారించిన అనంతరం ప్రభాకర్‌రావు నుంచి కీలక స్టేట్‌మెంట్ రికార్డ్ చేయాలని సిట్ నిర్ణయించింది. కేసు నమోదు అయినప్పటి నుంచి నిందితుల స్టేట్‌మెంట్‌లు, బాధితుల వాంగ్మూలాలు, ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్టులు, కాల్ డేటా వంటి పలు కీలక ఆధారాలను సిట్ ఇప్పటికే సేకరించింది. ఇప్పటి వరకు ప్రభాకర్‌రావును 12 సార్లు విచారించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ తాజా విచారణతో ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
READ MORE: Shambhala Trailer: ఆది సాయికుమార్ .. ‘శంబాల’ ట్రైలర్ రిలీజ్