ఈరోజు పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేసిన సిట్ అధికారులు... రేపు బీజేపీ కీలక నేతల స్టేట్‌మెంట్ తీసుకోనున్నారు. ఎంపీలు ఈటెల, ధర్మపురి, రఘునందన్ రావులకు సిట్ నుంచి పిలుపు వచ్చింది. ఈ ముగ్గురి ఫోన్లతోపాటు... వీళ్ల అనుచరులు, కుటుంబ సభ్యులు, ఎన్నికల సమయంలో వీరికి ఆర్థిక సహాయం చేస్తున్న వాళ్ల ఫోన్లు సైతం ట్యాపింగ్ గురైనట్లు ఆధారాలు సేకరించారు సిట్ అధికారులు.