8 Vasanthalu Movie Update: మీరు తనని రేపు చూస్తారు.. ‘8 వసంతాలు’ ఇంట్రెస్టింగ్ పోస్టర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Phanindra Narisetti’s 8 Vasanthalu Movie Update: ‘ఫణీంద్ర నర్సెట్టి’.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ‘మధురం’ షార్ట్ ఫిల్మ్ ద్వారా యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్ రావడంతో ఫణీంద్ర పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోయింది. మధురం షార్ట్ ఫిల్మ్ ద్వారా ఫణీంద్ర, చాందిని చౌదరి చాలా ఫేమస్ అయ్యారు. దర్శకుడిగా ‘మను’ అనే సినిమాను ఫణీంద్ర తీశాడు. బ్రహ్మానందం కొడుకు రాజా గౌతమ్ నటించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.
మను సినిమా అనంతరం ఫణీంద్ర నర్సెట్టి చాలా గ్యాప్ తీసుకున్నాడు. దాదాపు 6 సంవత్సరాల తర్వాత ‘8 వసంతాలు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబందించిన ఓ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. 8 వసంతాలు ఫస్ట్ లుక్‌ను శుక్రవారం ఉదయం 11.07కు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసి.. ‘మీరు తనని రేపు చూస్తారు’ అని పేర్కొన్నారు.
Also Read
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
- Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్‌పే..
Also Read: Miss You First Look: ‘మిస్ యూ’ ఫస్ట్ లుక్ విడుదల.. సరికొత్తగా సిద్దార్థ్!
న్యూ ఏజ్ రొమాంటిక్ డ్రామాగా 8 వసంతాలు మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇద్దరు ప్రేమికుల మధ్య ఎనిమిదేళ్లలో జరిగిన సంఘటనల సమాహారమే ఈ సినిమా కథ. ‘365 రోజులను అంకెలతో కొలిస్తే ఒక సంవత్సరం. అదే అనుభవాలతో కొలిస్తే.. ఒక వసంతం’ అని గతంలో రిలీజ్ చేసిన పోస్టర్లో పేర్కొన్నారు. ఈ సినిమాకి సంబందించి మరిన్ని వివరాలు రేపు తెలియరానున్నాయి.
Tomorrow at 11:07 AM ❤️
Stay tuned to @MythriOfficial#8Vasantalu pic.twitter.com/BdMFnPUIsq
— Mythri Movie Makers (@MythriOfficial) June 6, 2024
తాజావార్తలు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
-
PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్‌పే..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!