Perni Nani: రాజుల సొమ్ము రాళ్ల పాలు అనే చందంగా ఉంది చంద్రబాబు పరిస్థితి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై టిడిపి నేతలు అసత్య ఆరోపణలు చేయడంపై మాజీ మంత్రి పేర్నినాని మండిపడ్డారు. ఆధారాలు చూపకుండా జైల్లో ఎవరు పెట్టారు చంద్రబాబును అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వానికి సంబంధం ఏంటి అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు పెట్టడమే మా బాధ్యత.. ఏ ఆధారాలు లేకుండానే సీఐడీ, ఏసీబీ, హైకోర్టు, సుప్రీం కోర్టులు చంద్రబాబును జైల్లో ఉంచారా అని ఆయన అడిగారు.
Read Also: Kajal Aggarwal: ‘భగవంత్ కేసరి’లో నా పాత్ర అదే.. అసలు విషయం చెప్పేసిన కాజల్
Also Read
- కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
- Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
- MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
తన అపారమైన మేధస్సును చంద్రబాబు ఉపయోగించి సుమారుగా 19 కేసుల్లో స్టేలు తెచ్చుకున్నాడు అని పేర్నినాని ఆరోపించారు. ప్లిడర్లు అందరూ చంద్ర బాబు పాపపు సొమ్ముతో పండుగ చేసుకుంటున్నారు.. సాక్ష్యాలు లేకుండా ఏ కోర్టు అయినా ఏన్నాళ్ళు వుంచుతుంది జైలులో.. ఇప్పటికీ ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ స్కిల్ డిపార్ట్మెంట్ లో అవినీతి జరిగిందని కేసులు నమోదు చేసింది.. ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్, జీఎస్టీ డిపార్ట్మెంట్ లు అవినీతి జరిగినట్లు కేసులు నమోదు చేశాయని ఆయన తెలిపారు. వాటన్నిటినీ ప్రామాణికంగా చేసుకొని విచారణ చేసి కేసు నమోదు చేసింది సీఐడీ డిపార్ట్మెంట్ అని పేర్నినాని వెల్లడించారు.
Read Also: Merugu Nagarjuna: దళితులపై జరిగిన దాడుల విషయంలో చర్చకు టీడీపీ సిద్ధమా..?
ఒక్కసారి కోర్టు తీర్పు ఇస్తే ఇక, ఆ అంశం కోర్టుకు సంబంధించింది.. కోర్టు పరిధిలోని అంశాలను మేము ఎలా మాట్లాడతాం అని మాజీమంత్రి పేర్నినాని ప్రశ్నించారు. అయినా ఎంతో మేధస్సు కలిగిన న్యాయవాదులను పెట్టీ కేసును చంద్రబాబు వాదించుకుంటున్నారు.. రాజుల సొమ్ము రాళ్ల పాలు అన్న చందంగా చంద్రబాబు పరిస్థితి తయారయ్యింది.. కనీసం ఒక్క కంప్యూటర్ కూడా బిగించకుండా డబ్బులు ఇప్పించి హవాలా రూపంలో డబ్బులు తెచ్చి కిలారు రాజేష్ కి, పీఏ శ్రీనివాస్ కి ఇచినట్లు ఇన్కమ్ టాక్స్ తెలిపింది అని ఆయన ఆరోపించారు.
Read Also: Driverless Cars: ఐఐటీ-హైదరాబాద్ క్యాంపస్‌లో డ్రైవర్ లేని కార్లు..
చంద్రబాబుపై కక్షపూరితంగా ప్రభుత్వం వ్యవహరించింది అని టీడీపీ నేతలు బొంకుతున్నారు అని పేర్నినాని మండిపడ్డారు. కాలం నడిచినప్పుడు నడిచింది ఎన్ని డ్రామాలు ఆడిన ఏమీ అణిచి వేశారు అని పేర్నినాని అన్నారు. మిమల్ని తాళ్లతో, రిబ్బన్లతో కట్టుకొన్నపుడు ఏమీ ఆపారు మిమల్ని, అర్థ నగ్న ప్రదర్శన చేసినప్పుడు అపారా, పవన్ కళ్యాణ్ వెళ్లి పొత్తు ప్రకటించినప్పుడు ఆపారా.. ఈ ప్రభుత్వం మిమల్ని ఏ విషయంలో గొంతు నొక్కుతున్నారు అనేది చెప్పాలి అని ఆయన డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!