సాయిధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిన్న జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరు కాగా.. చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు, ప్రభుత్వ వైఖరిని, పోకడలపై పవన్ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ కు ఏపీ మంత్రి పేర్ని నాని రివర్స్ కౌంటర్ ఇచ్చారు. సాయితేజ్ ప్రమాదంలో మీడియాను పవన్ తప్పుపట్టడం సరైంది కాదన్నారు. తెలంగాణ పోలీసులు స్టేట్మెంట్ ఆధారంగానే మీడియా చెప్పిందని, మీడియాపై పవన్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడం కరెక్ట్ కాదన్నారు. పవన్ తిట్టాల్సి వైసీపీని కాదని, దమ్ముంటే కేసీఆర్ ని, తెలంగాణ పోలీసులను తిట్టాలన్నారు.
ఇక మెగాస్టార్ చిరంజీవి గూర్చి పేర్నినాని మాట్లాడుతూ.. ‘మాకు కూడా చిరంజీవి అంటే అభిమానం.. మేము చదువుకున్న రోజుల నుంచి చిరంజీవి గారి సినిమాకి దండాలు వెయ్యటం, కాలేజ్ ఎగ్గొటం, ఒకటికి రెండు సార్లు ఆయన సినిమాలు చూశాం.. చిరంజీవిని అన్నయ్య అని, సురేఖమ్మ గారిని వదినమ్మ గారని మాట్లాడుకొనే వాళ్ళం. ఆరోజుల్లో పవన్ కళ్యాణ్, సురేఖమ్మ గారు చెప్పినట్లుగా చదువుకోని ఉంటే ఈ బాధలు ఉండేవి కాదుగా’ అని మంత్రి పేర్నినాని అన్నారు.