Site icon NTV Telugu

Perni Nani: క్యూఆర్‌కోడ్‌లు మీరే ప్రవేశ పెట్టారా..? నకిలీ మద్యంపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు..

Perni Nani

Perni Nani

Perni Nani: ఏపీలో మద్యం అమ్మకాల్లో క్యూఆర్ కోడ్ తామే ప్రవేశపెట్టమన్నట్లుగా సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఇది తామే కనిపెట్టినట్లుగా చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని.. అన్నీ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లు పెట్టి చెప్తుంటే సారా మంత్రి ఏమి చేస్తున్నారని విమర్శించారు.. జగన్ ప్రభుత్వ హయాంలో మద్యం బాటిల్ ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చే ముందే క్యూఆర్ కోడ్ తోనే వచ్చేదని.. ఇప్పుడు అదేదో ఘన కార్యంలా చెప్పుకుంటున్నారన్నారు.. మీరు రాగానే అసలు ఎందుకు తీసేశారు.. ఇప్పుడు ఎందుకు ప్రవేశపెట్టారని ప్రశ్నించారు.. రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ల మద్యం దందాలు కుళ్ళు కంపు కొడుతున్నాయని.. వీళ్ల చెయ్యి దాటి కల్తీ మద్యం దందా నడుస్తుండటంతో క్యూఆర్ కోడ్ డ్రామాలు ఆడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.నకిలీ మద్యం ఫ్యాక్టరీలను మేమే పట్టుకున్నాం అంటున్నారు.. మీరు అధికారంలోకి వచ్చిన 17 నెలలుగా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.. మీ మనుషులు లిక్కర్ షాపుల నుంచి బెల్ట్ షాపుల వరకు జోరుగా నకిలీ మద్యం సరఫరా చేశారని.. వాటాలు పంచుకోవటంలో తేడాలు రావటంతో అన్నీ బయటకు వచ్చాయన్నారు..

READ MORE: Bhatti Vikramarka: సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ రూ.400 కోట్లు!

రాష్ట్ర వ్యాప్తంగా మీ వ్యాపారం బయట పడటంతో ఇప్పుడు క్యూఆర్ కోడ్ అంటున్నారని.. రాష్ట్రంలో 3786 మద్యం దుకాణాలు ఉంటే ప్రతీ షాపుకు పర్మిట్ రూంలు ఉన్నాయని మాజీ మంత్రి పేర్నినాని తెలిపారు.. “సీఎం చంద్రబాబు, ఎక్సైజ్ కమిషనర్ మీనాతో రాష్ట్రంలో బెల్ట్ షాపులు ఉన్నాయని చెబుతున్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు బెల్ట్ షాపులు ఉన్నాయని ఒప్పుకున్నారు. మొత్తం వ్యవహారం అంతా జయచంద్రారెడ్డి నడిపారు అన్నారు.. ఇప్పటివరకు అరెస్ట్ చేశారా..? సురేంద్రనాయుడు కూడా దొరకలేదా..? నకిలీ సారా కంపులో కూరుకుపోయి ఇదంతా వైసీపీ కుట్ర అని సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు.. కల్తీ మద్యం అంశాన్ని ఎలా కవర్ చేయాలో అర్థంకాక సచ్చిపోతున్నారు.. ఇందులో ఏ టీడీపీ నేతకు సంబంధం లేదని జనార్ధన్ వీడియో పంపారు.. ఆ తర్వాత ఇంతవరకు ఒక్కరికి కూడా రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వలేదు. మా వాళ్ళు సోషల్ మీడియా పోస్టులు పెట్టినా రెడ్ కార్నర్ నోటీసులు ఇస్తున్నారు.. వాళ్లకు వీళ్లు కనిపించటం లేదా.. పెళ్ళికి వెళ్ళి వస్తుంటే రిసీవ్ చేసుకున్నట్లుగా జనార్ధన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. మీకు నిజంగా నిజాయితీ కలిగినవాళ్ళు అయితే మీ ప్రభుత్వాన్ని బద్నాం చేసిన వారి విషయంలో ఎలా ట్రీట్ చేయాలి.. మొత్తం మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామా తర్వాత నేను వైసీపీ హయం నుంచే చేస్తున్నా అని జనార్ధన్ స్టేట్మెంట్ వీడియో తీసి బయటకు వదిలారు. కథ మొత్తం జోగి రమేష్ వైపు తిప్పారు.. జనం నమ్ముతారా అని కూడా సిగ్గు లేకుండా మాట్లాడుతారు.. జోగి రమేష్ చెప్తేనే ఇదంతా చేశారా..? ప్రభుత్వం అధికారంలో ఉన్నది ఎవరో కూడా మర్చిపోయి మాట్లాడుతున్నారు.. ఆర్భాటంగా 99 రూపాయలకే మందు అన్నారు.. ఇవాళ దాన్ని ఎందుకు అటక ఎక్కించారు..” అని పేర్ని నాని ప్రేస్‌మీట్‌లో వ్యాఖ్యానించారు.

READ MORE: Bollywood: ఒకే ఫ్రేమ్‌లో యూట్యూబ్ సెన్సేషన్ మిస్టర్‌ బీస్ట్.. షారుఖ్, సల్మాన్, ఆమిర్ ఖాన్.. కొత్త సినిమా రాబోతోందా..?

Exit mobile version