NTV Telugu Site icon

Perni Nani: చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లపై పేర్ని నాని ఫైర్

Perni Nani

Perni Nani

Perni Nani:  టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. రాజకీయ నాయకులకు ట్రాన్స్‌ఫర్స్ ఉంటాయా అని చంద్రబాబు అంటున్నారని.. చంద్రబాబు చంద్రగిరి నుంచి కుప్పంకి, కోడెల శివప్రాసాద్ నరసరావుపేట నుండి సత్తెనపల్లికి ఎలా వచ్చారని ఆయన ప్రశ్నించారు. 175 సీట్లకు 175 సీట్లు గెలవడానికి జగన్ అన్ని ఏర్పాట్లు, వ్యూహాలు సిద్ధం చేస్తున్నారన్నారు. మేము వద్దనుకున్న నలుగురు రెడ్లను చేర్చుకున్నావు, ఒక రాజు గారిని కౌగిలించుకున్నావంటూ చంద్రబాబును ఉద్దేశంచి వ్యాఖ్యానించారు. జగన్ వేసే రాజకీయ ఎత్తుగడలకు చంద్రబాబుకి షాకులు తగులుతున్నాయన్నారు. చంద్రబాబు శవాల మీద పేలాలు ఏరుకునే రకమని.. కొత్తగా వైసీపీ ఎమ్మెల్యేల మీద చంద్రబాబుకు ప్రేమ పుట్టుకొచ్చిందన్నారు. గోతికాడ నక్కలా వైసీపీ ఎమ్మెల్యేల కోసం ఎదురు చూస్తున్నాడన్నారు. చంద్రబాబుకి రాజకీయాల్లో కుక్క చావు తప్పదన్నారు.

Read Also: Andhrapradesh: కేంద్ర బృందంతో సీఎం జగన్‌ భేటీ.. మిచౌంగ్ తుఫాన్‌ నష్టం అంచనాలపై చర్చ

మచిలీపట్నంలో పవన్ కళ్యాణ్ పై సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి పేర్ని నాని.పవన్‌కి వైసీపీ, జగన్‌ను ఓడించడం మాత్రమే ధ్యేయమని, ఏపీ ప్రజల అభివృద్ధి, బాగోగులు పవన్‌కు అక్కర్లేదన్నారు. జగన్‌ను ఓడించి చంద్రబాబుకి అధికారం కట్టబెట్టడం పవన్ ధ్యేయమని, చంద్రబాబు రాజకీయ మనుగడే పవన్ లక్ష్యమని విమర్శించారు. పవన్ జనసేన అనే టెంట్ హౌజ్ పార్టీ పెట్టాడని 4 ఏళ్ల క్రితం చెప్పానన్న ఆయన.. చంద్రబాబుకు పవన్ తన టెంట్ హౌజ్ పార్టీనీ లాంగ్ లీజ్‌కి ఇచ్చాడని విమర్శలు గుప్పించారు. పవన జీవనం అంతా పరాయి రాష్ట్రంలో ఓటు అక్కడే , గాలి పీల్చడం అక్కడే, ఆస్తులు అక్కడే.. రాజకీయాలు మాత్రం పవన్ ఏపీలో చేస్తాడన్నారు. పేర్ని నాని మాట్లాడుతూ.. “నేను, జగన్ చచ్చినా మా శవాలు ఏపీలోనే పాతిపెడతారు. పవన్ కళ్యాణ్ కానీ చంద్ర బాబు కానీ ఎందుకు వారు అధికారంలో ఉన్నపుడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదు. ఒక మెడికల్ కాలేజీ కానీ, పోర్ట్ కానీ, ఫిషింగ్ హార్బర్ కానీ,ఎందుకు నిర్మించలేదు. మా కన్నా ఎక్కువ బడ్జెట్ కేటాయించారు, అప్పులు తెచ్చారు అవన్నీ ఏమయ్యాయి… పవన్ కి వున్న ఒకే ఒక ఆరాటం చంద్రబాబుకు అధికారం కట్టబెట్టాలి.” అని పేర్ని నాని పేర్కొన్నారు.