ఏపీ రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి. ఆయా పార్టీ అధినేతలు ఢిల్లీ పర్యటనలతో ఏపీ రాజకీయాలు హస్తినకు చేరుకున్నట్లైంది. అయితే.. బీజేపీతో చంద్రబాబు చర్చలపై పేర్ని నాని ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన కృష్ణా జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీతో చంద్రబాబు అర్థరాత్రి చర్చల కారణమేంటి ? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వంతో చర్చలు జరిపితే మంచిదేనని, 2014లో బీజేపీ రాష్ట్రానికి అవసరం అన్నారు చంద్రబాబు అని ఆయన అన్నారు. 2019 వరకు కలిసి ఉండి చివర్లో మోసం చేసిందని బీజేపీని తిట్టారని, మోడీకి భార్యాపిల్లలు కుటుంబం లేని వ్యక్తి నాతో పోటీనా అని చంద్రబాబు విమర్శించారని ఆయన వ్యాఖ్యానించారు. మళ్ళీ కలిసి పోటీ చేయటంపై చర్చలు ఎందుకు ప్రజలకు సమాధానం చెప్పాలని పేర్ని నాని అన్నారు.
Rent Agreement : రెంట్ అగ్రిమెంట్ కేవలం 11 నెలలకే ఎందుకో తెలుసా ?
రాష్ట్రానికి బీజేపీ ఏ న్యాయం చేసిందో చంద్రబాబు చెప్పాలని, ఒక్కరిగా జగన్ పై గెలవలేక పవన్, బీజేపీని తెచ్చుకుంటున్నారన్నారు. బీజీపీ, టీడీపీ చేసిన పాపాలకు ప్రజలకు క్షమాపణ చెబుతారా అని పేర్ని నాని మండిపడ్డారు. మాకు సిగ్గు లేదు రాజకీయాలు కావాలి అని ఓట్ల కోసం ప్రజల దగ్గరకు వస్తారా అని ఆయన అన్నారు. .బీజేపీ కొత్తగా ఏపీకి రాష్ట్రానికి ఏం న్యాయం చేసింది. ప్రత్యేక హోదా ఇచ్చిందా? రైల్వే జోన్ ఇచ్చిందా? పోర్టు నిర్మాణం పూర్తిచేసిందా? కడప స్టీల్ ప్లాంట్ కట్టిందా? పోలవరం పూర్తి చేయించి ఇచ్చిందా? నిర్వాసితులకు ఈరోజుకీ నయాపైసా ఇవ్వలేదు. ఏపీలో ఒక్కపోర్టు నిర్మాణంలోనైనా సాయం చేశారా? దోసెడు పట్టి.. చెంబుడు నీరు ఇచ్చారని చంద్రబాబే చెప్పాడు. అధికారం కోసం చంద్రబాబు ఏ గడ్డైనా కరుస్తాడు. ఒంటరిగా జగన్‌ను గెలవలేక పవన్, బీజేపీని తెచ్చుకోవాలని చూస్తున్నాడు. బీజేపీ, చంద్రబాబు చేసిన పాపాలకు క్షమాపణ చెబుతారా? సిగ్గు.. ఎగ్గులేకుండా జనం మధ్యకు వస్తారా? సమాధానం చెప్పాలి’ అని ఎమ్మెల్యే పేర్ని నాని మండిపడ్డారు.
U19 World Cup 2024: సెమీస్‌లో ఆస్ట్రేలియాపై ఓటమి.. మైదానంలో ఏడ్చేసిన పాకిస్తాన్ ఆటగాళ్లు!