Pathaan: ఒక్కరోజులోనే వంద కోట్ల క్లబ్ లో పఠాన్.. అదిరా.. షారుఖ్ రేంజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pathaan: బాలీవుడ్ బాద్షా అని మరోసారి నిరూపించాడు షారుఖ్ ఖాన్. ఒక్కరోజులోనే వంద కోట్ల క్లబ్ లో చేరిపోయి ఆశ్చర్యపరిచాడు. షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే జంటగా సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన చిత్రం పఠాన్. భారీ అంచనాల మధ్య అన్ని భాషల్లో నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా ఒక్కరోజులోనే సంచలనాన్ని సృష్టించింది. షారుఖ్ కెరీర్ లోనే మునుపెన్నడు లేని కలక్షన్స్ రాబట్టి షాక్ ఇచ్చింది. విడుదలైన ఒక్కరోజులోనే వందకోట్ల క్లబ్ లో చేరింది.. ఇప్పటివరకు ఈ రికార్డు సాధించిన సినిమాలు కేవలం 5 మాత్రమే.. తాజాగా పఠాన్ ఆ లిస్ట్ లో చేరి 6వ సినిమాగా రికార్డ్ సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు తొలిరోజే 106 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు అందుకొని ఇండస్ట్రీని షేక్ చేసింది. కేవలం హిందీలోనే రూ. 55 కోట్లు రాబట్టి ఆల్ టైమ్ రికార్డును అందుకుంది. రా ఏజెంట్ గా షారుఖ్ యాక్షన్.. దీపికా అందాల ఆరబోత.. సిద్దార్థ్ టేకింగ్ అద్భుతంగా ఉన్నాయని అభిమానులు చెప్పుకొస్తున్నారు.
గతేడాది బాలీవుడ్ పతనం అవుతుందని, ఒక్క స్టార్ హీరో కూడా బాలీవుడ్ ను నిలబెట్టలేరని ట్రోలర్స్ ఎన్నో విధాలుగా విమర్శించారు. విమర్శించడం అని కాదు కానీ, భారీ బడ్జెట్ చిత్రాలు అంటూ కథలోని సినిమాలను ప్రేక్షకుల మీద రుద్దారు. అందుకు తగ్గట్టే అభిమానులు, నెటిజన్లు బాలీవుడ్ ను ఏకిపారేశారు. ఇక ఇప్పుడప్పుడే బాలీవుడ్ కోలుకోలేదు అన్న సమయంలో పఠాన్ అడుగుపెట్టాడు. ఒక్కసారిగా పఠాన్ రాకతో బాలీవుడ్ ఊపిరి పీల్చుకొంది. ఒక్కరోజులోనే వంద కోట్ల క్లబ్ లో చేరడం అంటే ఆషామాషీ విషయం కాదు. అది బాలీవుడ్ లో షారుఖ్ వలనే సాధ్యమైంది. అదిరా షారుఖ్ రేంజ్ అంటూ ఆయన అభిమానులు బల్లగుద్ది, కాలర్ ఎత్తి చెప్పుకొస్తున్నారు. మరి ముందు ముందు ఈ సినిమా ఇంకెలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
-
CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?