Health Tips: షుగర్ వ్యాధి ఉన్న వాళ్లు ఈ తప్పులు చేయకండి.. లేదంటే కష్టమే..!
- ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆరోగ్య సమస్యగా మారుతున్న మధుమేహం
- ఈ వ్యాధి బారిన పడుతున్న అన్ని రకాల వయస్సు వాళ్లు
- దీని నివారణ గురించి జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచవ్యాప్తంగా మధుమేహం తీవ్ర ఆరోగ్య సమస్యగా మారుతుంది. పిల్లల నుండి వృద్ధుల వరకు అన్ని వయసుల వారు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అందుకే.. ఈ వ్యాధి నివారణ గురించి జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధించడానికి.. జీవనశైలి, ఆహారం రెండూ చాలా ముఖ్యం అని వైద్యులు అంటున్నారు. ఇందులో డైట్ ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. మీరు తినేవి.. తిననివి మీ చక్కెర స్థాయిలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. మధుమేహం అనేది ఒక వ్యాధి.. ఈ వ్యాధి పట్ల ఏ మాత్రం అజాగ్రత్త వహించినా అనేక సమస్యలకు దారి తీస్తుంది. డయాబెటిస్తో బాధపడేవారు లేదా వచ్చే ప్రమాదం ఉన్నవారు కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచిస్తున్నారు.
Giorgia Meloni: ఉక్రెయిన్ యుద్ధాన్ని భారత్ పరిష్కరించగలదు.. ఇటలీ ప్రధాని కామెంట్స్..
Also Read
- Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్‌కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు..?
డయాబెటిస్ ఉన్నవారు క్రమం తప్పకుండా వైద్యుడిని సంప్రదించడం అవసరం. రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా చెక్ చేసుకోకపోవడం, అవసరమైన మందులు తీసుకోకపోవడం సమస్యను మరింత పెంచుతుంది. అంతే కాకుండా.. రోజువారీ దినచర్యకు సంబంధించిన కొన్ని విషయాలపై శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం.
చక్కెర మాత్రమే కాదు.. ఇవి కూడా హానికరం
చక్కెరతో తయారు చేయబడిన పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి. డయాబెటిస్ ఉన్న వాళ్లు తీపి పదార్థాలను నివారించడం చాలా ముఖ్యం. ఇది ఒక్కటే సరిపోదు. బర్గర్లు, పిజ్జా, ప్రాసెస్ చేసిన స్నాక్స్ వంటి ఫాస్ట్ ఫుడ్స్ తగ్గించాలి. ఎందుకంటే.. వీటిల్లో అధిక మొత్తంలో కొవ్వు, చక్కెర ఉంటాయి. ఇవి అసాధారణంగా అధిక చక్కెర స్థాయిలకు దారితీస్తాయి. మీరు వీటిని ఎక్కువగా తీసుకుంటే.. మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు సమయానికి ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.
శారీరక శ్రమ లేకపోవడం
రెగ్యులర్ వ్యాయామం వల్ల శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. అంతేకాకుండా.. బ్లడ్ షుగర్ ను మెరుగ్గా నియంత్రిస్తుంది. ఒకవేళ వ్యాయామం చేయకపోతే మధుమేహం సమస్యలను పెంచుతుంది. మీకు మధుమేహం ఉన్నా, లేకపోయినా క్రమం తప్పకుండా 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి. వ్యాయామం ద్వారా బరువు అదుపులో ఉంటుంది. అలాగే.. మధుమేహ ప్రమాదం నుంచి తగ్గిస్తుంది.
అధిక ఒత్తిడి తీసుకోవద్దు
మధుమేహ వ్యాధిగ్రస్తులు అధిక ఒత్తిడి తీసుకోవద్దు. దాని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. ఒత్తిడి సమయంలో శరీరంలో ఒత్తిడి హార్మోన్ (కార్టిసాల్) స్థాయి పెరుగుతుంది. ఇది ఇన్సులిన్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఈ క్రమంలో.. యోగా, ధ్యానం, సరైన నిద్ర వంటి ఒత్తిడిని తగ్గించే చర్యలు తీసుకోవాలి. తగినంత నిద్ర ఒత్తిడి, మధుమేహం రెండింటినీ అదుపులో ఉంచుతుంది.
తాజావార్తలు
-
UPI Safety: ఈ చిన్న పొరపాట్లు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావొచ్చు.. యూపీఐ వాడేవారు తప్పక తెలుసుకోవాలి.!
-
Kings and Queens Pub: కూకట్‌పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్‌పై పోలీసుల ఆకస్మిక దాడులు.. 9 మంది అదుపులోకి
-
Raviteja : ‘ఇరుముడి’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. సరైన డేట్ లాక్ చేసిన మేకర్స్
-
Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్‌కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
-
Nana Patekar Slap Incident : నానాపటేకర్ గారు నన్ను చెంపదెబ్బ కొట్టింది నిజమే.! ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!