MYTH: చిన్నతనంలో ఇలాంటివి ఎన్నో వింటుంటాం. ఆ సమయంలో ఎవరు చెప్పినది అయినా మనం చాలా తేలికగా నమ్ముతాము.. ఎందుకంటే ఏది ఒప్పో ఏది తప్పో అర్థం చేసుకునే వయసు మనది కాదు. ఒక్క శాతం కూడా నిజం లేని వాటిని కూడా మనం తేలికగా నమ్మేస్తాం.. సూర్యగ్రహణం సమయంలో ఇంట్లోంచి బయటకి అడుగుపెడితే నల్లగా మారుతుందనే విషయం మీరు చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటారు.
Read Also:YV Subbareddy: పంచకర్ల రమేష్ బాబు రాజీనామా తొందర పాటు చర్య
గ్రహణం మనల్ని భయపెట్టిన దానికంటే మనుషులే మనల్ని మరింత భయపెడుతుంటారు. గ్రహణం గురించి ఎన్నో రకాల కథలు, ఫాంటసీలను సృష్టించుకున్నాము. హిందూ మతంలో సూర్యగ్రహణం, చంద్రగ్రహణం రాహువు, కేతువు అనే ఇద్దరు రాక్షసుల వల్ల సంభవిస్తాయని నమ్ముతారు. ఇది కాకుండా, ప్రపంచంలోని వివిధ దేశాలలో దీని గురించి వివిధ నమ్మకాలు ఉన్నాయి. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఖగోళ సంఘటనలు అయినప్పటికీ.. దానికి పేరెంట్స్ ఈ సమయంలో పిల్లలు బయటికి వెళితే నల్లబడి పోతారని భయపెడతారు.
Read Also:Pathan: రష్యాలో పఠాన్… మొదటి రోజు రిలీజ్ ఖర్చులు కూడా రాలేదు
ఇందులో ఎంతమాత్రం నిజం లేదు. ఇంతకు ముందు కాలంలో కరెంటు లేదు కాబట్టి సూర్యగ్రహణం సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లడం నిషిద్ధం. కాబట్టే ఈ విషయాలు చెప్పబడ్డాయి. బయటికి వెళితే మనకి ఎలాంటి హాని జరగకూడదని అనిపించేది అప్పట్లో.. అయితే ఇప్పుడు బయటకు వెళ్లే సమస్యే లేదు. కానీ, గ్రహణ సమయంలో బయటికి వెళితే నెగిటివ్ ఎనర్జీ మనపై పనిచేస్తుందని బయటకు వెళ్లేందుకు పెద్దలు నిరాకరిస్తారు.