సెప్టెంబర్ 7న ఇండియన్ బాక్సాఫీస్ పై జవాన్ గా దాడి చేయడానికి రెడీ అయిన కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, ప్రస్తుతం రష్యాలోకి పఠాన్ గా ఎంటర్ అయ్యాడు. 2023 జనవరి 25న ఇండియాలో రిలీజ్ అయిన ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్లు రాబట్టింది. బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులని చెల్లా చెదురు చేసి కింగ్ ఖాన్ ని బాక్సాఫీస్ బాద్షాగా మళ్లీ నిలబెట్టింది పఠాన్ సినిమా. యష్ రాజ్ ఫిల్మ్స్ ‘స్పై యూనివర్స్’లో భాగంగా రిలీజ్ అయిన పఠాన్ సినిమా బాలీవుడ్ కి పూర్వవైభవం తెచ్చింది. బాయ్కాట్ ట్రెండ్ కారణంగా క్రైసిస్ లో ఉన్న బాలీవుడ్ ని షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో రివైవ్ చేసేసాడు. పదేళ్ల తర్వాత హిట్ కొట్టిన షారుఖ్ తన బాక్సాఫీస్ స్టామినా ఎప్పటికీ తగ్గదని నిరూపించాడు. పదేళ్లు హిట్ అనేదే తెలియకుండా, ఐదేళ్లు అసలు సినిమాలే చేయకుండా ఇంట్లో ఉంటూ వచ్చిన ఒక హీరో ఈ రేంజ్ కంబ్యాక్ ఇచ్చిన దాఖలాలు ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే లేదు అంటే అతిశయోక్తి కాదేమో.
పఠాన్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తున్న సమయంలో నార్త్ లో మరో సినిమా దాదాపు నెల రోజుల పాటు థియేటర్స్ లో కనిపించలేదు అంటే షారుఖ్ ర్యాంపేజ్ ఏ రేంజులో జరిగిందో అర్ధం చేసుకోవచ్చు. అయితే రష్యాలో మాత్రం ఈ జోష్ కనిపించట్లేదు. మొదటి రోజు రష్యాలో పఠాన్ సినిమా 600K రష్యన్ కరెన్సీని మాత్రమే రాబట్టింది. ఇది బాహుబలి 2 (430K) కన్నా ఎక్కువే కానీ షారుఖ్ రేంజ్ కి మాత్రం చాలా తక్కువ. కేవలం అయిదున్నర లక్షలు రాబట్టిన పఠాన్ సినిమా మొదటి రోజు కనీసం రిలీజ్ కి అయిన ఖర్చులని కూడా రాబట్టలేకపోయింది. పేరుకి మాత్రం పఠాన్ సినిమా ఇండియాస్ టాప్ డే 1 గ్రాసర్ గా నిలిచింది. మరి ఫుల్ రన్ లో అయినా పఠాన్ సినిమా రిలీజ్ ఎక్స్పెన్సెస్ ని అయినా వసూల్ చేస్తుందా? లేక నామ్ కే వాస్తే ఎంతోకొంత రాబడుతుందా అనేది చూడాలి.